Man charged Rs 500 at Secunderabad rail station parking సికింద్రాబాద్ రైల్వే పార్కింగ్ లో వీరబాధుడు.. ఆలస్యమైతే రూ.500..

Man charged rs 500 at secunderabad rail station parking ktr calls it fleecing

Secunderabad railway station, Secunderabad trains timings, Secunderabad parking, KTR news, Telangana news, Secunderabad train news, IRCTC, Bhoiguda parking

A parking ticket from the Secunderabad Railway Station, amounting to Rs 500 for a time of 31 minutes did the rounds on social media, prompting officials to take note of the issue. Taking to Twitter, AK Jairath, a retired Brigadier and Army officer said, “Privatisation shows its colour. Parking a car for 31 minutes at a railway station now costs Rs 500 as parking charges. Whose Vikas? (sic).”

సికింద్రాబాద్ రైల్వే పార్కింగ్ లో వీరబాధుడు.. ఆలస్యమైతే రూ.500..

Posted: 11/10/2021 09:23 PM IST
Man charged rs 500 at secunderabad rail station parking ktr calls it fleecing

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ప్రధానమైంది సికింద్రాబాద్‌ జంక‌్షన్‌. ఈ స్టేషన్‌ మీదుగా నిత్యం వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. లక్ష మందికి పైగా ప్రయాణికులు ఈ స్టేషన్‌ను వినియోగించుకుంటారు. రద్దీ తగ్గట్టుగా స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని, పీపీపీ మోడ్‌లో పనులు చేపట్టబోతున్నట్టు ఇన్నాళ్లు ప్రకటిస్తూ వస్తోన్న రైల్వేశాఖ.. ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. సామాన్యుల నడ్డీ విరిచేలా పార్కింగ్‌ ఫీజుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తోంది.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ కి ఇరువైపులా పార్కింగ్‌ ప్లేస్ లు ఉన్నాయి. ఇక్కడ టూవీలర్‌, ఫోర్‌ వీలర్‌ వాహనాలను ప్రయాణికులు నిలిపి ఉంచుతున్నారు. దక్షిణ మధ్య తాజా నిబంధనల ప్రకారం ఇక్కడ రెండు గంటల పాటు టూ వీలర్‌ నిలిపి ఉంచితే రూ.15, ఫోర్‌ వీలర్‌ అయితే రూ.50 వంతున పార్కింగ్‌ ఛార్జీగా విధించింది. ఎవరైనా రెండు గంటలకు మించి పార్కింగ్‌ ప్లేస్‌లో వాహనం నిలిచి ఉంచినట్టయితే గుండె గుబిల్లుమనేలా జరిమానాలు విధిస్తోంది రైల్వేశాఖ. రెండు గంటల తర్వాత మొదటి ఎనిమిది నిమిషాలకు ఎటువంటి ఎక్స్‌ట్రా ఛార్జ్‌ లేదు. కానీ ఆ తర్వాత గడిచే ఒక్కో నిమిషానికి ఒక్కొ రేటు విధించింది. అవి చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం.

ఆ ధరలు ఇలా వున్నాయి:-

* తొలి రెండు గంటల తర్వాత 8 నుంచి 15 నిమిషాల ఆలస్యానికి ఓవర్‌ స్టే పార్కింగ్‌ ఛార్జ్‌ రూ.100
* తొలి రెండు గంటల తర్వాత 16 నుంచి 30 నిమిషాల ఆలస్యానికి ఓవర్‌ స్టే పార్కింగ్‌ ఛార్జ్‌ రూ.200
* తొలి రెండు గంటల తర్వాత 30 నిమిషాలు దాటి ఆలస్యమయితే ఓవర్‌ స్టే పార్కింగ్‌ ఛార్జ్‌ రూ.500

ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతం అవుతున్న సామాన్యులకు ఈ ఎక్స్‌ట్రా పార్కింగ్‌ ఛార్జీలు శరాఘాతంగా మారాయి. పండగ వేళ స్టేషన్‌కి వెళ్లి ఓవర్‌ స్టే పార్కింగ్‌ ఛార్జీల కాటుకు గురైన ఎందరో సోషల్‌ మీడియా వేదికగా రైల్వేపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే నవంబర్ 4న.. దీపావళి పండుగ నేపథ్యంలో తన ఇంటికి వస్తున్న బంధువులను పిక్ అప్ చేసుకునేందుకు రైల్వే స్టేషన్ కు వచ్చిన మాజీ అర్మీ బ్రిగేడియర్ అధికారి ఏకే జైరథ్ కు ఈ సెగ తగిలింది. ఆయన కేవలం 31 నిమిషాల పాటు కారును పార్కు చేశారు.

దీంతో కారును 31 నిమిషాల పాటు పార్క్ చేసినందుకు అక్కడి అధికారులు ఆయనకు ఏకంగా రూ.500 పార్కింగ్ ఫీజును విధించారు. దీంతో ఆయన తన బాధను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ నెల 9న షేర్ చేసుకున్నారు. దీనిని కొందరు నెట్ జనులు రాష్ట్ర మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన నేరుగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు విషయాన్ని చేరవేశారు. ఈ తరహా ధరలపై కేంద్రం తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ తరహా ధరలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కోన్నారు. మంత్రి నుంచి ట్వీట్ అందుకున్న వెంటనే దానిని సంబంధిత అధికారులకు చేరవేసిన కేంద్రమంత్రి.. తక్షణం చర్యలు తీసుకోవాలని అదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles