Shah Rukh Khan meets Aryan at Arthur Road jail ముంబై ఆర్థర్ రోడ్ జైలులో ఆర్యన్ ను కలసిన షారుఖ్ ఖాన్

Shah rukh khan meets his son aryan khan at arthur road jail

Shah Rukh Khan, Aryan Khan, Arthur Raod Jail, Mulakaat, bail denied, Mumbai High Court, Narcotics Control Bureau (NCB), Aryan khan, BJP Leader Relative, Rishabh Sachdev, Mohit Kamboj, mumbai cruise drugs case, Sameer wankhede, shah rukh khan meet his son aryan khan, shah rukh khan aryan khan, Arthur Road jail Jail food, NCB court, mumbai cruise drugs case, cordelia drugs case, Shah Rukh Khan, Arbaaz Khan, Munmun Dhamecha, Gauri Khan, Crime

Bollywood star Shah Rukh Khan on Thursday morning reached Arthur Road Jail in Mumbai to meet his son Aryan Khan after his bail plea was rejected by a special NDPS court yesterday.

ITEMVIDEOS: ముంబై ఆర్థర్ రోడ్ జైలులో ఆర్యన్ ను కలసిన షారుఖ్ ఖాన్

Posted: 10/21/2021 12:38 PM IST
Shah rukh khan meets his son aryan khan at arthur road jail

ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్ లో జ‌రిగిన రేవ్ పార్టీలో పట్టుబడిన బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు అర్యన్ ఖాన్ అక్టోబర్ 8 నుంచి ముంబైలోని అర్థర్ రోడ్డులోగల కేంద్ర కారాగారంలో జుడీషియల్ రిమాండ్ ఖైదీగా వున్నాడు. దీంతో తన కొడుకును చూసేందుకు ఇవాళ షారుఖ్ ఖాన్ జైలు అధికారులు అనుమతని పోందారు. అనుమతి లభించడంతో ఆయన ఇవాళ ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలుకు చేరుకుని ఆర్యన్ ఖాన్ ను కలిశారు. ఈ సందర్భంగా స్టార్ కిడ్ గా ఎదిగిన తన బిడ్డ పరిస్థితి, జైలు వాతావరణాన్ని చూసిన షారుఖ్ ఖాన్ భావోద్వేగానికి గురయ్యారని తెలుస్తోంది.

ముంబై ప్రత్యేక కోర్టు క్రితం రోజున ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ ను మరోమారు తిరస్కరించిన నేపథ్యంలో షారుఖ్ ఖాన్ ఇవాళ జైలుకు వెళ్లి బిడ్డకు ధైర్యం చెప్పారని.. త్వరలోనే ఆయనను బెయిలుపై బయటకు తీసుకువస్తానని, అందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పినట్లు సమాచారం. ఎలాంటి అధైర్యానికి లోనుకాకుండా ధైర్యంగా ఉండాలని, వేళకు బోజనం చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో అర్యన్ ఖాన్ కు సంబంధాలు వున్నాయన్న సమాచారం మేరకు ఈ కోణంలోనూ విచారణ జరగాలని పేర్కోన్న న్యాయస్థానం ఆయన బెయిల్ పిటీషన్ ను తోసిపుచ్చింది.

దీంతో అర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ కోసం ఆయన తరపు న్యాయవాదులు ఇవాళ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఉదయం పది గంటలకు ఆర్యన్ ఖాన్ కు సంబంధించిన బెయిల్ పిటీషన్ ఆయన తరపు న్యాయవాదులు న్యాయస్థానంలో దాఖలు చేశారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బాంబే హైకోర్టులోని సింగిల్ జడ్జి జస్టిస్ ఎన్ డబ్యూ సాంబ్రే ఎదుట ఈ బెయిల్ పిటీషన్ దాఖలైంది. ఇదిలావుండగా, వర్తమాన నటితో కూడా అక్టోబర్ 2వ రోజున అర్యన్ ఖాన్ వాట్సాఫ్ ద్వారా మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారంపై చాట్ చేయడంతో.. ఇవాళ ఎన్సీడబ్యూ అధికారులు అనన్య పాండే నివాసంపై కూడా దాడులు నిర్వహించారు.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles