Man has to wash clothes of all women in his village "గ్రామ మహిళల బట్టలు ఉచితంగా ఉతకాలి"

Bihar court orders molestation accused to wash and press women s clothes for free

Lalan Kumar Safi, washerman, accused in molestation case, bail plea, court conditional bail, women clothes, washing, iron, 6 months, Avinash Kumar, Jhanjharpur Additional Session court, Laukaha Bazar area, Madhubani district, Bihar, Crime

A court in Bihar’s Madhubani district granted bail to a man accused of molestation on the condition that he should wash and iron the clothes of all women in his village free of cost for six months, Jhanjharpur Additional Session Avinash Kumar had passed the order on September 16 in response to a petition of a washerman named Lalan Kumar Safi who was arrested in the case on April 18.

"గ్రామ మహిళల బట్టలు ఉచితంగా ఉతకాలి": కోర్టు కండీషనల్ బెయిల్

Posted: 09/24/2021 05:47 PM IST
Bihar court orders molestation accused to wash and press women s clothes for free

ఓ మహిళపై లైంగిక దాడికి యత్నించిన ఒక నిందితుడు ఐదు నెలలుగా జుడిషియల్ రిమాండ్ లో వున్నాడు. తనకు బెయిల్ మంజూరు చేయాలని ఇటీవల ఆ నిందితుడు న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశాడు. అతని బెయిలు పిటీషన్ పై విచారించిన న్యాయస్థానం అతనికి దిమ్మదిరిగే కండీషన్ ను పెట్టింది. న్యాయస్థానం పెట్టిన షరుతుకు సదరు నిందితుడు అంగీకరించడంతో అతనికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే వృత్తి రిత్యా సదరు నిందితుడు గ్రామాస్థుల బట్టలు ఉతికే ధోబి పని చేస్తాడని తెలిసే న్యాయస్థానం ఈ కండీషన్ పెట్టింది.

ఇంతకీ న్యాయస్థానం అత్యాచారయత్నం చేసిన నిందితుడికి ఏం షరతు విధించిందో తెలుసా.. నిందితుడు ఆరు నెలల పాటు గ్రామంలోని మహిళలందరి బట్టలు ఉచితంగా ఉతకడంతోపాటు ఇస్త్రీ చేసి ఇవ్వాలని చెప్పింది. కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై ఆ గ్రామంలోని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీహార్ లోని మజోర్ గ్రామానికి చెందిన 20 ఏండ్ల లాలన్ కుమార్ బట్టలు ఉతుకుతూ జీవనోపాధి పొందేవాడు. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో మహిళపై లైంగిక దాడి యత్నం కేసులో పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు. కాగా, బెయిల్‌ కోసం కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై కొర్టు విచారణ జరిపింది. దీని కోసం వింత షరతు విధించింది.

ఆరు నెలలపాటు గ్రామంలోని మహిళలందరి బట్టలు ఉచితంగా ఉతికి, ఇస్త్రీ చేసి ఇవ్వాలని.. అందుకయ్యే ఖర్చును కూడా భరించాలని పేర్కొంది. కోర్టు తీర్పుపై గ్రామంలోని సుమారు 2 వేల మంది మహిళలు హర్షం వ్యక్తం చేసినట్లు గ్రామ సర్పంచ్‌ నసీమా ఖాటూన్ తెలిపారు. ‘ఈ తీర్పు చారిత్రాత్మకమైంది. మహిళల గౌరవాన్ని పెంపొందిస్తుంది. మహిళల గౌరవాన్ని కాపాడటానికి సహాయపడుతుంది’ అని ఆమె అన్నారు. మహిళలపై జరిగే నేరాల గురించి సమాజంలో చర్చించడంపై ఇది సానుకూల ప్రభావం చూపుతుందని ఆ గ్రామంలో మహిళలు తెలిపారు. ‘ఇది ఒక ముందడుగు. సమాజానికి సందేశాన్ని పంపే విభిన్నమైన శిక్ష’ అని అంజుమ్ పెర్వీన్ అనే మహిళ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles