Pegasus case: Supreme Court to hear PILs next week సోషల్ మీడియాలో చర్చలెందుకు.? పెగాసెస్ పై సుప్రీంకోర్టు

No parallel social media debates supreme court to pegasus petitioners

SC bench, Pegasus spyware, state surveillance, Indian govt surveillance, supreme court pegasus hearing, supreme court pegasus plea, pegasus spyware news, Phone spyware, snooping row, Journalists, Politicians, Activists, Governent surveillance, Amit Shah, PM Modi, National Politics

The Supreme Court told petitioners seeking a probe into the Pegasus scandal that they should "have faith in the system" and not take part in "parallel debates on social media".The court also postponed further hearing to Monday, after Solicitor General Tushar Mehta, appearing for the government, sought more time to read and respond to the petitions.,

సోషల్ మీడియాలో చర్చలెందుకు.? పెగాసెస్ పై సుప్రీంకోర్టు

Posted: 08/10/2021 04:17 PM IST
No parallel social media debates supreme court to pegasus petitioners

పెగాసస్ వివాదంపై విచారణ సందర్బంగా దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంలో న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న సందర్భంలో ఇక్కడే మీకున్న అభిప్రాయాలను వ్యక్తపర్చాలి.. కానీ సోషల్ మీడియా ద్వారా సమాంతర చర్చలు నిర్వహించడం దేనికి సంకేతమని ప్రశ్నించింది. కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో సోషల్ మీడియాలో అనవసర చర్చలు ఎందుకని హెచ్చరించింది. న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని ఉంచాలని పేర్కోంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టును ఆశ్రయించిన తర్వాత చెప్పాలి అనుకున్నది కోర్టులోనే చెప్పాలని సుప్రీం ధర్మాసనం పేర్కోంది.

ఇవాళ కేసు విచారణకు సుప్రీం ధర్మాసనం చేపట్టగా.. ఈ కేసులో విచారణకు మరికొంత సమయం కావాలని సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా ధర్మాసనాన్ని కోరారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసిన న్యాయస్థానం.. ఈ కేసు విషయంలో ఎవరూ తమ హద్దులను దాటవద్దని సూచించింది. ప్రతీ ఒక్కరికీ అవకాశం ఇస్తామని అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం పేర్కోంది. పిటీషనర్లు ఏదైనా చెప్పాలనుకుంటే అది కోర్టులో చెప్పాలని సీజేఐ ఎన్వీ రమణ సూచించారు. న్యాయస్థానంలో ఈ అంశంపై సమగ్ర చర్చ జరుగుతుందని అన్నారు.

ఈ వ్యవహారంపై వచ్చిన అన్ని పిటిషన్లపై ఒకే సారి విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇజ్రాయిల్ లోని ఎన్ఎస్ఓ సాప్ట్ వేర్ సంస్థ రూపోందించిన పెగాసెస్ సాప్ట్ వేర్ తో దేశంలోని రాజకీయ, జర్నలిస్టు, సామాజిక కార్యకర్తలతో పాటు పారిశ్రామిక వేత్తల ఫోన్లపై కేంద్రం నిఘా పేట్టిందన్న అరోపణలు వున్నాయి. ఇక పెగాస‌స్ వ్య‌వ‌హారంలో జ‌రిగే కోర్టు విచార‌ణ‌ను లైవ్‌లో ప్ర‌సారం చేయాల‌ని జ్యుడిషియ‌ల్ అకౌంట‌బులిటీ అండ్ రిఫార్మ్స్ సంస్థ కోరింది. ఈ నేప‌థ్యంలో సీజే ర‌మ‌ణ‌కు లేఖ కూడా రాసింది. పెగాస‌స్ స్నూపింగ్ కేసు విచార‌ణ‌ను లైవ్‌లో వెబ్ ద్వారా ప్ర‌సారం చేయాల‌ని ఎన్జీవో సీజేఏఆర్ కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles