సోషల్ మీడియాలో తాము పోస్ట్ చేసిన వీడియోలకు అత్యధిక లైకులు రావాలని అందుకోసం పోడి పడి మరీ వీడియోలు రూపోందిస్తున్న అనేక మంది యువత. అందులో కొన్ని రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని కొన్ని వీడియోలు మన మనసుకు హత్తుకుంటాయి. మరికొన్ని ఆహ్లాదాన్నిస్తాయి. ఇంకొన్నిసార్లు షాకింగ్‌ని కలిగిస్తాయి. అయితే సోషల్ మీడియా రాత్రికి రాత్రే పాపులర్ కావాలంటే కొంత సాహసంతో కూడిన వీడియోలు అయితే బాగుండు అని కొందరు ఎలాంటి సాహసానికైనా తెగిస్తున్నారు.
ఈ తరహాలోనే కొంత విచిత్రంగా అలోచించిన ఓ యువకుడు బాహుబలి చిత్రంలోని స్టంట్లు చేయాలని యోచించాడు. అప్పటికే ఇలాంటి స్టంట్లు చేసి అనేక మంది ప్రాణాలపైకి తెచ్చుకున్నారన్న విషయం తెలిసి కూడా అలాంటి స్టుంటే చేయబోయాడు. అందరూ బాహుబలిలోని అమరేంద్ర బాహుబలి చేసిన ఏనుగు స్టంట్లను చేయబోయి కొందరు విగతజీవులుగా మారితే మరికోందరు ప్రాణాల మీదకు తెచ్చుకన్నారు. అయితే ఈ యువకుడు మాత్రం తాను ఏనుగుతో గే్మ్స్ అడనని, ఎద్దు కొమ్ములు విరిచి.. సత్తా చాటాలని అనుకున్నాడు. కానీ ఆతని ప్రయత్నం బెడిసికొట్టింది.
ఎద్దు కొమ్ములు పట్టుకుని వంచేందుకు ప్రయత్నిస్తుండగా దానికి ఒక్కసారిగా కోపం వచ్చి ఎత్తి పడేసింది. ఈ మొత్తం సంఘటనను తన స్నేహితులు సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు.అదృష్టవశాత్తూ అతడుకి ఎటువంటి గాయాలు కాలేదు. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియో పై నెటిజన్లు స్పందిస్తూ .. నీవు ఏమైనా బహుబలి సినిమాలో బల్లాల దేవుడివి అనుకుంటున్నావా అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రాణాలు జాగ్రత్త.. ఏదైనా అతి చేస్తే.. పర్యావసనాలు ఇలానే ఉంటాయని మరి కొందరు హెచ్చరిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more