Croatia Legrad is selling homes at cheapest price మహిళకు కరోనా వాక్సీన్ కు బదులు ర్యాబిస్ వ్యాక్సీన్

Woman given rabies vaccine instead of covid 19 jab in nalgonda

rabies vaccine instead of COVID-Vaccine, Kattamguru Primary Healthcare Centre, Sanitaty worker Prameela, healthcare worker Negligence, woman, sanitaty worker, rabies vaccine, covid vaccine, Nalgonda, Primary Health centre, Ayush Building, Kattamguru, Nalgonda

In a shocking incident, a woman was given the rabies vaccine instead of COVID-19 here at a Primary Healthcare Centre in Kattamguru of Nalgonda district. A healthcare worker who administered a rabies vaccine to a woman earlier did not read the letter and administered the same vaccine to Prameela with the same syringe.

నల్గోండలో మహిళకు కరోనా వాక్సీన్ కు బదులు ర్యాబిస్ వ్యాక్సీన్

Posted: 06/30/2021 01:34 PM IST
Woman given rabies vaccine instead of covid 19 jab in nalgonda

దేశవ్యాప్తంగా వేగంగా వాక్సీనేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో వైద్యసిబ్బందికి పనిబారం అధికమైందన్న విషయం తెలిసిందే. వైద్య సిబ్బంది విదుల నిర్వహణ వల్ల యావత్ దేశప్రజలు కరోనా తట్టుకోగలిగే యాంటీబాడీస్ ను కలిగివుంటున్నారు. కానీ ఇందులో కొందరు వైద్యసిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వల్ల రాష్ట్రవైద్య సిబ్బంది విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. బీహార్ లోని ఓ మహిళకు ఐదు నిమిషాల వ్యవధిలో రెండు వాక్సీన్ డోసులు ఇవ్వడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలో నిరక్షరాస్యుల సంఖ్య అధికంగా వున్న నేపథ్యంలో వైద్యాధికారులు తగు చర్యలు తీసుకుని వాక్సీన్ ప్రక్రియను చేపడుతున్నా అక్కడక్కడా ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

తాజాగా నల్గొండ జిల్లాలో కరోనా టీకా కోసం వెళ్లిన ఓ మహిళకు స్థానిక వైద్య సిబ్బంది ర్యాబిస్ వాక్సీన్ ఇవ్వడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. కరోనా టీకా వేయించుకునేందుకు కట్టంగూరు మండలం బొల్లెపల్లి ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పుట్ట ప్రమీల వెళ్లింది. అయితే తనకు చదువు రాకపోవడంతో.. ఏ వాక్సీన్ తీసుకోవాలో తెలియని ఆమె తాను పనిచేస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇచ్చిన లేఖ తీసుకుని కరోనా టీకా వేయించుకునేందుకు కట్టంగూరు పీహెచ్‌సీకి వెళ్లింది. ఇక్కడి పీహెచ్‌సీ భవనంలో సాధారణ టీకాలు ఇస్తుండగా, పక్కనే ఉన్న ఆయుష్ భవనంలో కొవిడ్ టీకాలు వేస్తున్నారు.

విషయం తెలియని ప్రమీల పీహెచ్‌సీకి వెళ్లింది. అక్కడ ఉన్న నర్సు అప్పటికే ఓ మహిళకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయగా, అదే సమయంలో వెళ్లిన ప్రమీలకు కూడా అదే సిరంజితో రేబిస్ టీకా ఇచ్చింది. కొవిడ్ టీకా ఇవ్వాలంటూ టీచర్ ఇచ్చిన లేఖ చూడకుండా తనకు అంతకుముందు ఉపయోగించిన సిరంజితోనే టీకా వేసిందని ప్రమీల ఆరోపించింది. ఒకే సిరంజితో ఇద్దరికి ఎలా వేస్తారని ప్రశ్నిస్తే నర్సు అక్కడి నుంచి వెళ్లిపోయిందని పేర్కొంది. బాధితురాలు కొవిడ్ టీకా బ్లాక్‌లోకి వెళ్లకుండా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇస్తున్న గదిలోకి వెళ్లడం వల్లే ఈ పొరపాటు జరిగిందని మండల వైద్యాధికారి తెలిపారు. నిజానికి ఆమెకు వేసింది యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కాదని, టీటీ ఇంజక్షన్ మాత్రమేనని, దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని అంటున్న అధికారులు అదే సిరంజీతో ఎలా ఇంజక్షన్ ఇస్తారన్న ప్రశ్నకు మాత్రం బదులివ్వకుండా జారుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles