LeT commander, Pak terrorist killed in encounter ఎల్ఈటీ టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ హతం..

Day after arrest let commander nadeem abrar bhat killed in crossfire

Parimpora, Top LeT commander killed in Encounter, Two militants killed in Maloora, LeT commander killed in Encounter in Srinagar, Two militants killed in Srinagar, Jammu and Kashmir Police, CRPF Forces killed LeT commander.

A day after his arrest, top Lashkar-e-Taiba (LeT) commander Nadeem Abrar and a Pakistani national were killed in an encounter in Parimpora area of the city, police said on Tuesday.

అరెస్టైయిన 24 గంటల్లో ఎల్ఈటీ టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ హతం..

Posted: 06/29/2021 12:14 PM IST
Day after arrest let commander nadeem abrar bhat killed in crossfire

జమ్మూకశ్మీర్ లో పరిమ్ పోరా చెక్ పోస్టు వద్ద భారత భద్రతా బలగాలకు చిక్కిన ఉగ్రవాద సంస్థ లష్కర్ ఇ తోయిబాకు చెందిన టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ సహా పాకిస్థానీ తీవ్రదానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 24 గంటలు గడవకముందే ఎన్ కౌంటర్లో హతమార్చారు. లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ సహా మరో ఇద్దరు పాకిస్థానీ ఉగ్రవాదులను కూడా భారత బధ్రతాబలగాలు మట్టబెట్టాయి. జమ్మూకాశ్మీర్ లోని అనేక మరణాలతో సంబంధమున్న నదీమ్ అబ్రార్ పోలీసులకు చిక్కడం విజయంగా అభివర్ణించిన పోలీసులు.. గత్యంతరం లేని పరిస్థితుల్లో అతడ్ని ఎన్ కౌంటర్ లో హతమార్చక తప్పలేదని పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు.

క్రితం రోజున శ్రీనగర్ శివార్లలోని పరిమ్ పొరా వద్దనున్న ఓ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ఓ కారులో వెనక కూర్చున నదీమ్ పోలీసులను చూసి త బ్యాగులోని గ్రానైడ్ విసిరేందుకు యత్నించగా.. వేగంగా స్పందించిన పోలీసులు ఆయనను హుటాహుటిన అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు పాకిస్థానీ ఉగ్రవాదని కూడా భద్రతాధికారులు అదుపులోకి తీసుకన్నారు. కాగా విచారణలో తాను ఏకే 47 రైఫిల్ ను మాలూరాలోని ఓ ఇంటిలో దాచి వుంచినట్టు చెప్పిన నదీమ్ అబ్రార్.. ఆ ఇంటిని చూపిస్తానని చెప్పడంతో మలూరా ప్రాంతంలో జమ్మూ పోలీసుల కార్డన్ సెర్చ్ చేశారు.

అనంతరం నదీమ్ అబ్రార్ ను తాను ఆయుధం దాచిన ఇంటికి తీసుకువస్తుండగా, అప్పటికే ఆ ఇంట్లో వున్న పాకిస్థానీ తీవ్రవాది పోలీసులను చూసి కాల్పులకు తెగబడ్డాడు. ఈ పరిణామాన్ని ఊహించని ముగ్గురు జమ్మూ పోలీసులు గాయాలపాలయ్యారు. ఆ వెంటనే తేరుకున్న భద్రతా బలగాలు ప్రతిదాడులకు తెగబడ్డాయి. ఈ క్రమంలో కాల్పులు జరుగుతుండగానే నదీమ్ అబ్రార్ కూడా భద్రతాబలగాలపైకి ఎదురుతిరిగాడు. దీంతో ఎన్ కౌంటర్ లో అతన్ని భారత బలగాలు మట్టుబెట్టాయి.

ఇతనితో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టాయి.  కాగా, కశ్మీర్ లో పౌరులపై మరియు భద్రతా దళాలపై పలు దాడుల్లో నదీమ్ ప్రమేయం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో లవాయ్ పొరాలో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది హత్య వెనుక నదీమ్ హస్తముందని స్థానిక పోలీసులు తెలిపారు. అనేక హత్యతత్లో నదీమ్ హస్తం ఉందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles