Egypt demands $550 mn from Japanese cargo ship owner ఎవర్ గ్రీన్ విడుదలకు ఈజిప్టు భారీ డిమాండ్

Suez canal blockade egypt demands 550 mn from japanese cargo ship owner

Egyptian authorities, Suez Canal, 550 million US dollars, Japanese cargo ship, Ever Given, compensation, passage blockade, Ismailia, global trade

Egyptian authorities are demanding 550 million US dollars in compensation from the Japanese owner of a cargo ship that blocked the Suez Canal for nearly a week in March. The large container ship Ever Given got stuck in the key waterway and prevented the passage of all other vessels for several days.

ఎవర్ గివెన్ నౌక విడుదలకు రూ.4100 కోట్లు డిమాండ్ చేసిన ఈజిప్టు

Posted: 06/01/2021 11:58 AM IST
Suez canal blockade egypt demands 550 mn from japanese cargo ship owner

సూయజ్ కాలువలో అడ్డంపడి ప్రపంచ వాణిజ్యానికి తీవ్ర నష్టం కలిగించిన ఎవర్ గివెన్ నౌకను ఈజిప్టు అధికారగణం షాక్ ఇచ్చింది. జపాన్ కు చెందిన ఎవర్ గ్రీన్ నౌకను అప్పగించేందుకు ఈజిప్ట్ యంత్రాంగం భారీ డిమాండ్ ను నౌక యజమాని ముందు పెట్టింది. తమకు కలిగిన నష్టపరిహారాన్ని చెల్లించేవరకు నౌకను విడుదల చేయడానికి ఈజిప్టు ససేమిరా అంటోంది. పరిహారమే కదా.. కట్టేస్తే పోలా అనుకుంటున్నారా.. అది కట్టాలంటే జేజమ్మ దిగిరావాల్సిందే. కానీ అది కట్టకపోతే సీజ్ చేసిన నౌకను ఇవ్వడం కుదరదని ఈజిప్టు అధికారులు గంటాపథంగా చెబుతున్నారు.

ఇంతకీ ఆ పరిహార మొత్తం ఎంత అంటారా.. ఏకంగా రూ. 4100 కోట్లు (550 మిలియన్ డాలర్లు). అయితే, తాను అంత మొత్తం చెల్లించలేనని, 150 మిలియన్ డాలర్లు మాత్రం ఇవ్వగలనని నౌక యజమాని షోయ్ కిసే‌న్ కౌషా పేర్కొన్నారు. సూయజ్ కాలువలో అడ్డంపడిన నౌకను కదిలించి, రవాణాను పునరుద్ధరించేందుకు 600 మందికిపైగా కార్మికులు కష్టపడ్డారని, ఈ క్రమంలో ఒకరు ప్రాణాలు కూడా కోల్పోయారని ఈజిప్టు ప్రభుత్వం గుర్తు చేసింది. కాబట్టి 550 మిలియన్ డాలర్లు అడగడంలో ఏమాత్రం తప్పులేదని పేర్కొంది. మరోవైపు, నష్టపరిహారం చెల్లించేంత వరకు దానిని ఈజిప్టులోనే ఉంచాలని కోర్టు ఇప్పటికే ఆదేశించింది.

ఇక ఎవర్ గ్రీన్ నౌక సూయిజ్ కాలువలో అడ్డంగా నిలవడంతో అదే మార్గంలో వెళ్లాల్సిన ఇతర దేశ వాణిజ్య నౌకలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ఈ మార్గాన్ని క్లియర్ చేయడానికి వారం రోజుల సమయం కూడా పట్టిందని.. ఈ క్రమంలో ఆదాయాన్ని కూడా కోల్పోయామని ఈజిప్టు అధికారులు పేర్కోంటున్నారు, ఈ విషయంలో తమ కార్మికుల హక్కులను తాము ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయబోమని అన్నారు. మార్చి నెల ఆరంభంలో పశ్చిమ జపాన్ కు చెందిన ఎవర్ గ్రీన్ పడవ సూయిజ్ కెనాల్ లో ఇర్కుకుపోయిన విషయం తెలిసిందే. దీనిని అదే నెల 29న అధికారులు క్రమబద్దీకరించిన మార్గాన్ని క్లియర్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles