Mobile users can switch between prepaid and postpaid via OTP మొబైల్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఓటిపితో మారిపోవచ్చు..

Mobile users may soon be able to switch from postpaid to prepaid and vice versa using otp

Smartphone, Cellular Operators Association of India, Department of Telecom, prepaid services, postpaid services, TRAI, proof of concept (PoC), OTP based authentication, Reliance Jio, Bharti Airtel, Vodafone Idea, KYC procedure, mobile customers

TDP senior leader and former Ponnur MLA Dhulipalla Narendra has got a sigh of relief from the Andhra Pradesh High Court as it has granted bail in the Sangam Diary case. He was arrested over the irregularities in the Sangam Dairy case, however, he was granted conditional bail by the Andhra Pradesh High Court.

మొబైల్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఓటిపితో మారిపోవచ్చు..

Posted: 05/25/2021 02:29 PM IST
Mobile users may soon be able to switch from postpaid to prepaid and vice versa using otp

మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు టెలికమ్యూనికేషన్ శాఖ శుభవార్తను అందించింది. ఇదివరకు ఫోన్ వినియోగదారులు పోస్ట్‌ పెయిడ్‌ నుంచి ప్రీ పెయిడ్ కు లేదా ప్రీ పెయిడ్‌ నుంచి పోస్ట్‌ పెయిడ్ కు మారాలంటే తమ గుర్తింపు కార్డును తీసుకుని సంబంధిత టెలికామ్ సర్వీస్ నిర్వాహక కార్యాలయానికి వెళ్లి అక్కడ తమ పేరును నమోదు చేసుకుంటే కానీ అది సాథ్యం కాదు. దీంతో పోస్టు ఫెయిడ్ కు ఓ రకం సిమ్ కార్డులు, ప్రీ పెయిడ్ కు మరో రకం సిమ్ కార్డులు ఇచ్చేవారు సర్వీసు ప్రోవైడర్లు. ఇక ఇలా మారిన నేపథ్యంలో దాదాపుగా 24 గంటల పాటు లేదా ఆరు గంటల పాటు సర్వీసులు సంబంధిత సిమ్ కార్డులకు అందేవి కూడా కాదు.

అయితే ఇకపై ఇలా మారాలంటూ ఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అసవరం లేదు. ఎలాంటి సిమ్‌ మార్చాల్సిన అవసరం లేదు. ఎలాంటి గుర్తింపు కార్డులు అవసరం లేకుండా, కనీసం సర్వీస్ ప్రోవైడర్లు కార్యాలయాలకు కూడా వెళ్లకుండా చకచకా ఇంట్లోనే కూర్చోని ఈ పనులను చక్కబెట్టుకోవచ్చు. అదెలా అంటారా...కేవలం ఓ ఓటీపీ(వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌) ద్వారా మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియ జరిగేలా టెలికం శాఖకు (డాట్‌) టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ ప్రతిపాదించింది. దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఆధారాలు (పీవోసీ) ఇవ్వాలంటూ టెలికం ఆపరేటర్లకు డాట్‌ సూచించింది.

పీవోసీని బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు డాట్‌ ఏడీజీ ఓ నోట్ లో తెలిపారు. టెలికామ్ సంస్థలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలు ప్రీపెయిడ్ నుంచి పోస్టు పెయిడ్ లేదా పోస్టు పెయిడ్ నుంచి ప్రీపెయిడ్ గా మార్చుకోవడంలో నూతనంగా కేవైసీ తెలుసుకునే పద్దతితో మార్పులు తీసుకురావాలంటూ ఇదివరకే ప్రతిపాదనలు తీసుకువచ్చాయి. అయితే వాటిని పరిశీలించిన టెలికమ్యూనికేషన్స్ శాఖ టెలికాం సంస్థల ప్రతిపాదనలకు అమోదం తెలిపింది. అయితే మార్పులకు అవసరమయ్యూ ప్రూప్ అఫ్ కాన్సెప్ట్ లను మాత్రం భద్రంగా జాగ్రత్తపర్చాలని అదేశించింది.

దీంతో ఇకపై కనెక్షన్‌ను మార్చుకోదల్చుకున్న వారు తమ సర్వీస్‌ ప్రొవైడర్‌కు ఎస్‌ఎంఎస్, ఐవీఆర్‌ఎస్, వెబ్‌సైట్, అధీకృత యాప్‌ ద్వారా అభ్యర్ధన పంపాల్సి ఉంటుంది. దీన్ని ఆమోదిస్తూ .. టెలికం సంస్థ ఒక ప్రత్యేక ఐడీ, ఓటీపీని మొబైల్‌ యూజర్ కి పంపిస్తుంది. ఈ ఓటీపీ 10 నిమిషాల దాకా చెల్లుబాటు అవుతుంది. ఓటీపీని ధృవీకరిస్తే.. కనెక్షన్‌ మార్పునకు యూజరు సమ్మతించినట్లుగా టెలికం సంస్థ పరిగణిస్తుంది. ఏ తేదీ, సమయం నుంచి మార్పు అమల్లోకి వస్తుందనేది సమాచారం అందజేస్తుంది. ఇలా కనెక్షన్‌ మారే క్రమంలో సేవల అంతరాయం గరిష్టంగా 30 నిమిషాల కంటే ఎక్కువ అంతరాయం ఉండరాదంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles