ICMR drops plasma therapy from COVID-19 treatment ప్లాస్మాధెరపీని కోవిడ్ చికిత్స విధానాల్లోంచి తొలగించిన ఐసీఎంఆర్

Covid 19 plasma therapy dropped from clinical management guidelines says icmr

Indian Council of Medical Research, ICMR, convalescent plasma therapy, Coronavirus, COVID-19, guidelines, plasma therapy, covid-19 patients, plasma therapy, covid19 vaccine, Covaxin telangana news, Covaxin second dose, Covaxin doses time gap, corona vaccine, covishield, Telangana vaccination drive, vaccine drive paused in Telangana, vaccination drive stopped, Telangana vaccines, Covaxin

The use of convalescent plasma has been dropped from the recommended treatment guidelines for COVID-19, according to late Monday advisory from the Indian Council of Medical Research (ICMR).

ప్లాస్మాధెరపీని కోవిడ్ చికిత్స విధానాల్లోంచి తొలగించిన ఐసీఎంఆర్

Posted: 05/18/2021 07:56 PM IST
Covid 19 plasma therapy dropped from clinical management guidelines says icmr

కరోనా వైరస్ మహమ్మారి రెండో దశలో విలయాన్ని సృష్టిస్తోన్న తరుణంలో దానిని నియంత్రించేందుకు వైద్యులు పలు రకాల చికిత్సను రోగులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో భాగంగా కరోనా వైరస్ తీవ్రంగా వున్న రోగులకు ప్లాస్మా థెరఫీని కూడా అందుబాటులో వున్న విషయం తెలిసిందే. అయితే కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ.. కేంద్రం ప్లాస్మా థెరపీపై కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ రోగులకు అందించే చికిత్స విధానాల్లో పలు మార్పులు చేస్తూ ఇకపై ప్లాస్మా థెరపీ విధానంతో కరోనా రోగులకు చికిత్సను అందించకూడదని తప్పించింది.

కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల నుంచి సేకరించే ప్లాస్మాతో ఇకపై చికిత్స చేయకూడదని కేంద్రం అదేశాలను జారీచేసింది. ప్లాస్మా థెరపీ పద్దతి చికిత్సను కరోనా రోగులకు చేయకూడదని స్పష్టం చేసింది. కరోనా రోగుల చికిత్సా విధానంలో నూతన మార్గదర్శకాలను ఇండియన్ మెడికల్ అండ్ రిసర్చ్ కౌన్సిల్, కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్, ఎయిమ్స్, జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సంయుక్తంగా  విడుదల చేశాయి. కరోనా చికిత్స విధానంలో భాగంగా గత ఏడాది ప్లాస్మా థెరపీతోనే అనేక మంది కరోనా రోగులకు చికిత్సను అందించారు. కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మాను సేకరించి పరిస్థితి విషమంగా ఉన్న బాధితులకు ఎక్కించి చికిత్స చేసేవారు.

దీనిద్వారా విషమపరిస్థితుల్లో వున్న వ్యక్తుల శరీరంలో యాంటీబాడీలు తయారై కరోనాను అడ్డుకుంటాయని డాక్టర్లు చెప్పారు. అయితే ప్లాస్మా ధెరఫీతో,, కరోనా విషమ పరిస్థితులకు జారుకున్న రోగులలో పెద్దగా ప్రతిరక్షకాలు వృద్దికావడం లేదని దీంతో ఆశించిన స్థాయిలో సానుకూల ఫలితాలు లేకపోవడంతో ప్లాస్లా థెరపీని పక్కన పెట్టారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుంటే స్వల్ప లక్షణాలుగా భావించాలని, అలాంటి వారిని హోమ్ ఐసోలేషన్ లోనే ఉంచి చికిత్స అందించాలని సూచించింది.

ఇక రక్తంలో ఆక్సిజన్ స్థాయి 90 నుంచి 93 మధ్యన ఉన్నా.. రెస్పిరేటరీ రేటు నిమిషానికి 24 కన్నా ఎక్కువగా ఉంటే… రోగ లక్షణాలు మధ్య స్థాయిగా ఉన్నట్టు గుర్తించాలని కేంద్రం సూచింది. ఇలాంటి రోగులను ఆస్పత్రుల్లోని సాధారణ వార్డులో చేర్పించి చికిత్స అందించాలంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయులు 90 కంటే తక్కువగా ఉండి.. రెస్పిరేటేరీ రేటు నిమిషానికి 30 కంటే ఎక్కువగా ఉంటే.. సీరియస్ కేసుగా పరిగణించాలని.. ఆ లక్షణాలు ఉన్న రోగులను వెంటనే ఆస్పత్రి ఐసీయూలో అడ్మిట్ చేసి చికిత్స మొదలెట్టాలని తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ, ప్రైవేటు అసుపత్రులు నూతన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఐసీఎంఆర్ అదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles