Court to Tata Nano owner: Pay Rs 91,000 parking charges నానో కారు యజమానికి రూ. 91 వేల జరిమానా.!

Court to tata nano owner pay rs 91000 parking charges

consumer court, Ahmedabad, Harsolia Brothers, Tata Nano Car Owner, Lawyer, Workshop, Parking charges, Sonanagar, Gandhinagar District, Gujarat, crime

While many of us complain about the parking charges at various spots in India, a court in Ahmedabad has directed a Tata Nano owner to pay Rs 90,000 as parking charges. The decision came after the owner did not take the delivery of the car for 910 days from the workshop.

నానో కారు యజమానికి రూ. 91 వేల పార్కింగ్ చార్జీ విధించిన కోర్టు!

Posted: 05/15/2021 05:42 PM IST
Court to tata nano owner pay rs 91000 parking charges

ఇష్టమైన కారు కొనుగోలు చేసుకుని దానిలో షీకారు చేయడం చాలా మందికి ఇష్టం. అయితే కారు ఖరీదు చేసే మొత్తాన్ని దాని నెంబరు ప్లేటు అదేనండీ ఇష్టమైన నంబరుకు ఖర్చు చేయడం కూడా కొందరికి మహాఇష్టం. ఆ నంబరు కలిసివస్తుందున్న భావన వారిలో ఉండటమే ఇందుకు కారణం. అయితే తమ ఇష్టమైన కారును ఓ కారు మెకానిక్ షెడ్డులో రిపేరు కోసం ఇచ్చిన.. తనకు నచ్చినట్టుగా రిపేరు చేయలేదని మూడేళ్లుగా కారును తీసుకెళ్లని ఓ కారు యజమానికి కోర్టు భారీ జరిమానా విధించింది. కారును షెడ్డులో తన రిపేరు చేసిన కారును గత మూడేళ్లుగా పెట్టినందుకు మెకానిక్ షెడ్డు ఓనర్ కు పార్కింగ్ చార్జీగా 91 వేల రూపాయలను చెల్లించాలని న్యాయస్థానం అదేశించింది.

గుజరాత్ లోని అహ్మదాబాద్ వినియోగదారుల కోర్టు ఈ మేరకు అదేశాలను వెలువరించింది. 910 రోజుల పాటు కారును తన వర్కషాపులో నిలిపినందుకు గాను కారు యజమానికి ఈ మేరకు పార్కింగ్ ఫీజులను చెల్లించాలని ఆదేశించింది. వృత్తిపరంగా లాయర్ అయిన సోనా సాగర్‌ అనే మహిళా న్యాయవాదికి అహ్మదాబాద్‌ వినియోగదారు కోర్టు తీర్పుతో పరాభవం ఎదురైంది. అమె తన సొంత కేసునే గెలువలేకపోయిందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి, టాటా కార్ డీలర్ వర్క్ షాప్ తన టాటా నానో కారును తన సంతృప్తికరంగా మరమ్మతులు చేయలేదని ఆరోపిస్తూ గాంధీనగర్ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌లో సోనా సాగర్ కేసు నమోదు చేసింది.

2018న జూన్ 7న సోనా సాగర్ అనే మహిళా న్యాయవాది కారును సమీపంలోని టాటా వర్క్ షాప్ లో రిపేరింగ్ కోసం ఇచ్చారు. వారం తరువాత, టాటా వర్క్ షాప్ ఆమెను పిలిచి వాహనం సిద్ధంగా ఉందని, తీసుకుని వెళ్లాలని, సర్వీసింగ్ మొత్తం బిల్లు 9,900 రూపాయలు అని చెప్పింది. నానోను తీసుకోవడానికి సోనా సాగర్ వర్క్‌షాప్ కు చేరుకున్నప్పుడు, ఎయిర్ కండిషనింగ్ యూనిట్ మరియు మ్యూజిక్ సిస్టమ్ తో సహా వాహనంలోని కొన్ని భాగాలు దెబ్బతిన్నాయని ఆమె ఆరోపించారు. టాటా వర్క్ షాప్ చెప్పిన సమాధానంతో తృప్తి చెందకపోవడంతో అమె తన కారును అక్కడే వదిలేసి వెళ్లింది. దీంతో అమె వర్క్ షాపుపై వినియోగదారుల కోర్టులో కేసు వేశారు.

తన కారును సర్విసింగ్ కోసం ఇవ్వగా దానిని సంతృప్తికరంగా రిపేర్ చేయకుండా చేశామని అబద్దం చెప్పారని, తన కారులో లోపాలను గుర్తించిన తరువాత మళ్లీ కారును అక్కడే వదిలేశానని చెప్పారు. అయితే పూర్తిగా రిపేరు చేసిన తరువాత తన కారును డెలివరీ చేయాలని ఆమె కోరారు. అయితే ఈ కేసు విచారణ ముగిసి తీర్పు చెప్పే నాటికి 910 రోజులు అయ్యింది. కాగా విచారణ సందర్భంగా వర్స్ షాపు యజమానులైన హర్సోలియా బ్రదర్స్ న్యాయస్థానికి హాజరై తాము న్యాయవాది కారు రిపేర్ చేయబడిందని, దానిని తీసుకువెళ్లాలని అమెకు 58 ఇమెయిళ్ల ద్వారా సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో న్యాయస్థానం అమెకు పార్కింగ్ చార్జీలు చెల్లించాలని తీర్పునిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : consumer court  Ahmedabad  Harsolia Brothers  Tata Nano Car Owner  Parking charges  Gujarat  crime  

Other Articles