Alekhya Harika steps down as ambassador of TSTDC పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్ గా తప్పకున్న హారిక

Alekhya harika steps down as ambassador of tstdc

Bigg boss Harika, Harika appointed as brand ambassador, Alekhya Harika, Telangana State Tourism Corporation development, brand ambassador, contraversy, Alekhya Harika, Brand Ambassador, Bigg Boss Harika, Telangana Tourism Website, V.Srinivas Goud, Srinivas Gupta, Telangana

Social media influencer and BB Telugu 4 finalist Alekhya Harika has stepped down as the ambassador of Telangana State Tourism Development Corporation (TSTDC). Commenting on her quick exit, Harika said, "Yes, I had to opt out as I was not comfortable with the issue being unnecessarily prolonged. A lot has been written about this. I kept quiet for two days but not anymore. I'm answerable to my fans as well. So, I had to come out and put an end to this once for all."

చేసిన రచ్చ ఇక చాలు.. పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్ గా తప్పకున్న హారిక

Posted: 03/11/2021 01:59 PM IST
Alekhya harika steps down as ambassador of tstdc

తెలంగాణ పర్యాటక శాఖకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబడ్డానా.. లేదా..? ఇప్పుడు ఇదే సందిగ్ధత దేతడి హారికతో పాటు అమె ఫాన్స్ లోనూ నెలకోంది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా యూట్యూబర్ దేతడి హారికను తెలంగాణ పర్యాటకశాఖ చైర్మన్ ఉప్పాల శ్రీనివాస్ గుప్తా అమెను.. తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. ఈ సందర్భంగా అమెకు నియామకపత్రం కూడా అందజేశారు. అయితే ఇలా జరిగిన 24 గంటలు కూడా గడవకముందే.. అమె నియామకం చెల్లదని వార్తలు వచ్చాయి. అంతేకాదు అమెకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి తొలగించారు.

తెలంగాణ పర్యాటక శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సమాచారం అందించకుండానే ఈ చర్యలను చేపట్టారని వార్తలు వచ్చాయి. అ తరువాత హారిక నేపథ్యంలో రేగిన వివాదం సద్దుమణిగిందని, కోట్ల రూపాయలను వెచ్చింది బడా సెలబ్రిటీలను తీసుకోకుండా లక్షల మంది వ్యూవర్స్ తో పాటు పెద్దస్థాయిలో అభిమానులు వున్న హారికను తీసుకుని పర్యాటక శాఖకు ప్రచారం కల్పించాలని పూనుకునే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చైర్మన్ ఉప్పాల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఇక పర్యాటక శాఖలో చైర్మన్ కు మంత్రికి మధ్య పోరపచ్చాలు వున్నాయన్నవార్తలనూ ఆయన ఖండించారు.

ఇలా చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు అసలు దేతడి హారిక అంటే ఎవరో కూడా తెలియదన్నారు. పర్యాటక శాఖకు పాపులారిటీ వున్న ఓ పెద్ద సెలబ్రిటీని త్వరలోనే బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తామని కూడా తెలిపారు. ఇక పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్ విషయంలో రేగిన వివాదంపై కూడా పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ జరపిస్తామని అన్నారు. దీంతో చైర్మన్ ఉప్పాల శ్రీనివాస గుప్తాకు.. శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు మధ్య శాఖపరంగా కోల్డ్ వార్ నడుస్తోందన్న విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో తన చుట్టూ రగుతున్న వివాదంపై యూట్యూబర్ దేత్తడి హారిక తీవ్ర మనస్తాపం చెందినట్టు కనిపిస్తోంది. తనకు తెలంగాణ పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్ గా ఎలాంటి పదవులు వద్దని, మునుపటిలా తన పనేదో తాను చేసుకుంటానంటూ అమె ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. వివాదం రేగడంతో తాను రెండు రోజుల పాటు మౌనంగా వున్నానని, ఇకపై తాను మౌనంగా వుండలేనని అన్నారు. తనను అభిమానించేవారికి తాను బదులు చెప్పాల్సిన బాద్యత తనపై వుందని అన్నారు.

అందుకనే ఈ బ్రాండ్ అంబాసిడర్ అనే అంశానికి సంబంధించి పూర్తిగా తేల్చుకుందామన్న నిర్ణయానికి తాను వచ్చానన్నారు. ఈ పరిణామంలో తాను ఎలాంటి బ్రాండ్ అంబాసిడర్ పదవులను అలంకరించబోవడం లేదని అమె తేల్చిచెప్పారు. దీంతో ప్రపంచ మహిళా దినోత్సవం రోజున మహిళలను ప్రత్యేకంగా గౌరవించకపోయినా పర్వాలేదు కానీ.. వారి మానన వారుండగా.. వారిని పిలిచి పదవులిచ్చి.. మళ్లీ వారే వివాదం రాజేసి.. మహిళ పరువును వారే తీయండం సంకుచిత భావాన్ని వ్యక్తం చేస్తోందని అమె అభిమానులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles