Miscreants attack TDP Spokesperson Pattabhi Ram టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దుండగులు దాడి..

Andhra pradesh tdp leader pattabhi attacked by unknown persons in vijayawada

TDP leader Pattabhi, Attack, car, cell phones, miscreants, Gurunanak nagar, Chandrababu, Nara Lokesh, Kodali Nani, YSRCP, TDP, Vijayawada, Gram Panchayat Elections, Nimmagadda Ramesh, Andhra Pradesh, Politics, Crime

TDP leader Pattabhi was attacked by unidentified persons. He was reportedly attacked while getting out of the car in the house and was rushed to hospital with injuries sustained in the attack. It is learnt that Pattabhi's car mirrors and cellphone were smashed in the incident. The perpetrators attacked with rods and sticks.

టీడీపీ నేత పట్టాభిపై దుండగులు దాడి.. అసుపత్రిలో చికిత్స..

Posted: 02/02/2021 03:40 PM IST
Andhra pradesh tdp leader pattabhi attacked by unknown persons in vijayawada

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, సీనియర్ నేత‌ కొమ్మారెడ్డి పట్టాభిపై విజయవాడలో దాడి జరిగింది. తన ఇంటి నుంచి టీడీపీ కార్యాలయానికి బయలుదేరుతున్న సమయంలో అకస్మాత్తుగా అక్కడికి చేరుకున్న 15 మంది దుండ‌గులు పట్టాభిపై దాడికి పాల్ప‌డ్డారు. రాడ్లు, కర్రలు చేతబూనిన ముష్కరులు.. అయన ఎప్పుడు ఇంట్లోంచి బయలుదేరుతారా అని అక్కడే మాటువేసి.. ఆయన ఇంటి నుంచి బయల్దేరగానే దాడికి పాల్పడ్డారు. రాడ్ల‌తో ఆయన కారును.. సెల్ ఫోన్లను కూడా దుండగులు ధ్వంసం చేశారు. తనతో పాటు తన డ్రైవర్ పై కూడా దుండగులు దాడి చేశారని చెప్పారు.

అలాగే, త‌న డ్రైవర్‌ను కూడా వారు గాయపరిచారని తెలిపారు. కాగా, దుండగుల దాడిలో ధ్వంసమైన కారుతో సహా టీడీపీ నేతలు సీఎం జగన్ నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. తనపై జరిగిన దాడి పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసిన పట్టాభి, ఇతర టీడీపీ నేతలు సీఎంను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, వారిని పట్టాభి నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. వారు సీఎం నివాసం వెపు వెళ్లకుండా నిలువరించే ప్రయత్నం చేశారు. దాంతో టీడీపీ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.

దీంతో విజయవాడలోని గురునానాక్ నగర్ లోని పట్టాభి నివాసానికి పెద్ద సంఖ్యలో చేరకున్న టీడీపీ కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు కూడా భారీగానే మోహరించారు, కాగా, అధికార పక్షం తమపై ఎన్ని దాడులు చేసిన‌ప్ప‌టికీ, భయపడనని,  ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాన‌ని పట్టాభి చెప్పారు. త‌నపై జ‌రిగిన దాడి ప‌ట్ల‌ డీజీపీ వచ్చి సమాధానం చెప్పాలని ఆయ‌న డిమాండ్ చేశారు. 6 నెలల క్రితం కూడా త‌న కారుపై దాడి జరిగిందని, అయిన‌ప్ప‌టికీ ఆ దాడిపై ఇప్పటికీ చర్యలు లేవ‌ని అన్నారు. ఇది వైసీపీ పాలనలో శాంతిభద్రతలు పరాకాష్టకు చేరుకున్నాయని తెలిపే ఘటనేనని అన్నారు.

ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలను బయటపెడుతున్నందునే తనను టార్గెట్ చేశారని తెలిపారు. గత 10 రోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని మీడియా ముఖంగా తెలిపినా, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. హైకోర్టు జడ్జిలు, ప్రముఖులు ఉండే ప్రాంతంలో తనపై దాడి జరిగిందని... రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో ఈ ఘటన తెలియజేస్తోందని అన్నారు. అధికారంలో కొనసాగుతూనే ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు చేస్తూన్న ఈ ప్రభుత్వం ఎంతో ఎక్కువ కాలం మనుగడ సాగించదని దుయ్యబట్టారు.  

అధికార పార్టీకి పోలీస్ వ్యవస్థ లొంగిపోయి పని చేస్తోందని పట్టాభి ఆరోపించారు. ఈ దాడి వెనుక మంత్రి కొడాలి నాని హస్తం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంట్లో కొడాలి నానితో పాటు మరికొందరు సమావేశమై చర్చించారని చెప్పారు. రౌడీయిజం చేస్తూ వైసీపీ నేతలు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఒక పథకం ప్రకారమే తనపై హత్యాయత్నం జరిగిందని అన్నారు. ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి జగన్ కు చెపుతున్నానని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP leader Pattabhi  Attack  car  cell phones  miscreants  Gurunanak nagar  YSRCP  TDP  Andra pradesh  Crime  

Other Articles