Bharat Biotech Releases Fact-Sheet on Covaxin కోవాక్సీన్ ను మీరు తీసుకోవచ్చా.? ఎవరు తీసుకోరాదు.?

Bharat biotech releases fact sheet amid concerns over covaxin side effects

Bharat Biotech, India, covaxin, Krishna Ella, Covid-19 vaccine, Made In India, Vaccine, Covid-19 Vaccine, Vaccine India, Covaxin fact sheet, Covid-19 vaccine fact sheet

Hyderabad based Bharat Biotech Ltd. created a fact sheet on Covaxin and posted it in its website this illustrates the side effects, and advises who shouldn't be vaccinated. The vaccine maker advises that people with any serious health conditions should talk to the healthcare provider or vaccinator before taking the vaccine.

కరోనా టీకా కోవాక్సీన్ ను మీరు తీసుకోవచ్చా.? ఎవరు తీసుకోరాదు.?

Posted: 01/19/2021 08:56 PM IST
Bharat biotech releases fact sheet amid concerns over covaxin side effects

హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే ఈ వాక్సీన్ ను భారత డగ్ర్ కంటోల్ అధారిటీ నుంచి అనుమతులు పోందినప్పటికీ.. పలువురిపై మాత్ర ప్రతికూల ప్రభావం చూపుతుందన్న విషయం జనవరి 16 నుంచి ప్రారంభమైన కోవిడ్ టీకా పంఫిణీతో స్పష్టత వచ్చింది. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన భారత్ బయోటెక్, ఎవరు టీకాలు వేయకూడదనే దానిపై కీలక ప్రకటన విడుదల చేసింది, ఈ మేరకు సదరు ఔషధ సంస్థ మీడియాకు సమాచార పత్రం (ఫ్యాక్ట్ షీట్) అందించింది.

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో దాదాపు 580 మంది తీవ్రమైన దుష్ప్రభావాలను ఎదుర్కొగా, వారిలో ఇద్దరు ప్రాణాలను కూడా కోల్పయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీకా నుండి ఎవరు దూరంగా ఉండాలని భారత్ బయోటెక్ ప్రకటించింది. టీకా ఎవరిపై దుష్ప్రభావాలను చాటుతుందో సవివరముగా తెలుపుతూ ఎవరికీ వాక్సీన్ ను వేయకూడదో సూచిస్తోంది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసిన సంస్థ వైబ్ సైట్ లో పోస్టు చేసింది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నవారు టీకా నుంచి దూరంగా వుండాలని పేర్కోంది. ఇక అరోగ్య సమస్యలు తలెత్తినవారు తప్పనిసరిగా తమ సమస్యను టీకాలు ఇచ్చే నర్సులతో కానీ లేదా అక్కడి ఆరోగ్య కార్యకర్తలతో కానీ తెలపాలని సూచించింది.

ఇక కరోనా టీకా కోవాక్సీన్ ను ఎవరు తీసుకోకూడదంటే...

* అలెర్జీ లేదా జ్వరం ఉన్నవారు
* రోగనిరోధక శక్తి తక్కువగా వున్నావారు లేదా రోగనిరోధక వ్యవస్థ కోసం మందులు తీసుకుంటున్నవారు.
* రక్త రుగ్మత కలిగినవారు
* గర్భవతులు, బిడ్డలకు పాలిచ్చే తల్లులు
* గతంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకున్నవారు

టీకాతో పలువురిలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవి:

* ఇంజెక్షన్ చేసిన చోట నొప్పి, వాపు, ఎరుపు లేదా దురద కలగడం.
* మోచేతి పైభాగం స్టిప్ గా అవ్వడం,
* వాక్సీన్ చేసిన చేయి బలహీనపడటం
* ఒళ్లునోప్పులు
* వికారం
* జ్వరం
* తలనొప్పి
* అనారోగ్యం
* బలహీనత
* దద్దుర్లు
* వాంతులు

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bharat Biotech  India  covaxin  Krishna Ella  Covid-19 vaccine  Made In India  Vaccine  Covid-19 Vaccine  

Other Articles