Supreme Court approves Central Vista project ప్రాజెక్టు విస్టాకు లైన్ క్లియర్.. సుప్రింకోర్టు పచ్చజెండా.!

Sc approves central vista project but asks centre to get prior approval from heritage panel

Central Vista redevelopment project, New Parliament building, new parliament project, Central Secretariat, new Rajpath, Rashtrapati Bhavan, India Gate, Supreme Court, Justice A.M. Khanwilkar, Justice Dinesh Maheshwari, Justice Sanjeev Khanna, Delhi Development Authority Act, Heritage Conservation Committee, Politics

The Supreme Court, in a majority judgment, on Tuesday gave the green signal for the multi-crore Central Vista redevelopment project. The project envisages refurbishing the nation’s power corridor, which includes a new Parliament building, a common Central Secretariat and a renovated Rajpath stretching from Rashtrapati Bhavan to India Gate.

ప్రాజెక్టు విస్టాకు లైన్ క్లియర్.. సుప్రింకోర్టు పచ్చజెండా.!

Posted: 01/05/2021 08:58 PM IST
Sc approves central vista project but asks centre to get prior approval from heritage panel

నూతన పార్లమెంటు భవనం, కేంద్ర సచివాలయం, రాష్ట్రపతి భవనం, ఇండియా గేట్ సహా దేశరాజధానిలోని పలు అభివృద్ది పనుల నిర్మాణాలను చేపట్టేందుకు ప్రాజెక్టు విస్టాకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం, స్థలం కేటాయింపు, డిజైన్ల అమోదం, పర్యావరణ అనుమతులు లభించడం వంటి వ్యవహారాలపై దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పలు పిటీషన్లను దాఖలయ్యాయి. వీటిపై విచారించన న్యాయస్థానం ఇవాళ్టికీ తీర్పును రిజర్వు చేసింది. ఇవాళ ఉదయం విస్టా ప్రాజెక్టుపై తీర్పును వెలువరిస్తూ పచ్చజెండాను ఊపింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై కేంద్రం చేసిన వాదనలతో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఏకీభవించింది.

త్రిసభ్య ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు విస్టా ప్రాజెక్టుకు అనుకూలంగా తీర్పును వెలువరించారు. దీంతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు 2:1 నిష్పత్తిలో మెజార్టీ తీర్పుతో గ్రీన్ సిగ్నల్ లభించింది. జస్టిస్ ఖాన్విల్కర్ తో పాటు జస్టిస్ దినేశ్ మహేశ్వరి ఏకాభిప్రాయంతో తీర్పును రాశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా మాత్రం విడిగా తీర్పు కాపీని రాశారు. పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టు డిజైన్లపై కేంద్రం వాదనలతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించింది. డీడీఏ చట్టం కింద చేపట్టిన ఈ ప్రాజెక్టు చట్టబద్ధమైనదేనని, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన అనుమతులు, స్థలం కేటాయింపులు కూడా సరిగ్గానే ఉన్నాయని న్యాయస్థానం తెలిపింది.

కాగా ప్రాజెక్టు నిర్మాణానికి హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనుమతులు తప్పనిసరి అని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఆ అనుమతులను తక్షణం తెచ్చుకోవాలని సూచించిన న్యాయస్థానం.. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించే స్మాగ్ టవర్లను ఏర్పాటు చేయాలని అదేశించింది, యాంటీ స్మాగ్ గన్ లను ఉపయోగించాలని కూడా అదేశించింది. ఆ తరువాతనే నిర్మాణాలను చేపట్టాలని సూచనలు చేసింది. కాగా ఈ కేసు విచారణ సమయంలోనే సెంట్రల్ విస్టా ప్రాజెక్టు శంకుస్థాపనకు అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం అంగీకారం తెలిపింది. దీంతో గత ఏడాది డిసెంబర్ 10న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ ప్రాజక్టుకు శంకుస్థాపన చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles