GHMC polls on Dec 1, results on Dec 4 జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్.. డిసెంబర్ 1న ఎన్నికలు..

Ghmc elections polling on december 1 counting of votes on december 4

Greater Hyderabad elections, Telangana SEC parthasarathy, GHMC voting, GHMC counting, GHMC Election Notification, GHMC Schedule released, GHMC Nominations, ghmc polls december 1, ghmc election schedule released, ghmc nominations from november 18, results declaration ghmc polls

The Greater Hyderabad Municipal Corporation elections will be held on December 1, Telangana State Election Commissioner Parthasarathy said on Tuesday. The filing of nominations would begin from November 18. Counting of votes would be done on December 4.

జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్.. డిసెంబర్ 1న ఎన్నికలు.. 4న కౌంటింగ్

Posted: 11/17/2020 02:55 PM IST
Ghmc elections polling on december 1 counting of votes on december 4

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలకు నగరా మ్రోగింది. డిసెంబరు 1వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషనర్ పార్థసారథి విడుదల చేశారు. షెడ్యూల్ విడుదలతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. రేపటి నుంచే జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని పార్థసారథి చెప్పారు. ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా, మరో మూడు రోజుల వ్యవధిలో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. ఈ నెల 20 వరకు మాత్రమే నామినేషన్లకు గడుపును విధించడం.. కేవలం రెండున్నర రోజుల వ్యవధినే నామినేషన్లకు కల్పించారు.

ఈ నెల 21న నామినేషన్ల స్ర్కూటినీ జరుగుతుందని తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 తుది గడువు అని చెప్పారు. డిసెంబరు 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుందని అన్నారు. అయితే ఇన్నాళ్లు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలో నిర్వహించాలని ప్రతిపక్షాలు కోరినా పట్టించుకోని ఎన్నికల కమీషన్.. జీహెచ్ఎంసీ ఎన్నికలను మాత్రం బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికల కమీషన్ నిర్వహిస్తోంది. ఈ మేరకు కమీషనర్ పార్థసారథి వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 వార్డులకు చట్ట ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అమలైన రిజర్వేషన్లే ఇప్పుడూ కొనసాగిస్తామని తెలిపారు.

వార్డుల వారీగా రిజర్వేషన్ల కేటాయింపులు జరపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని.. ఆ ప్రకారమే ఎన్నికల నిర్వహణ జరుగనుందని తెలిపారు, శాసనసభ ఎన్నికల నాటి ఓటర్ల జాబితా ఆధారంగానే ఈ‌ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. 2020 జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు ఓటు వేసేందుకు అర్హులని వివరించారు. బల్దియా పరిధిలో ఉన్న ఓటర్లలో 52.09 శాతం పరుషులు, 47.90 శాతం మహిళలు ఉన్నారని వివరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 74,04,000 మందికి పైగా ఓటర్లున్నారని వెల్లడించారు. మైలార్‌దేవ్‌పల్లిలో అత్యధికంగా 79,290 మంది, రామచంద్రాపురంలో అత్యల్పంగా 27,997 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియకు కావాల్సిన అన్ని పనులు పూర్తి చేసినట్లు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles