Mumbai Police accuse Republic TV in TRP scam టీఆర్పీ రేటింగ్ స్కామ్ లో రిపబ్లిక్ టీవి..

Republic tv trp fraud busted mumbai police set to quiz arnab goswami

Mumbai Police, Param Bir Singh, India news, TRP, TRP Ratings, news channels, Republic TV, Fakt Marathi, Box Cinema, BARC, Sushant Singh Rajput, Kangana Ranaut

The Mumbai Police said on Thursday that they unearthed a 'major racket' of gaming television rating points, or TRPs, by at least three channels, including Republic TV, and arrested four people, contending that the manipulated audience numbers were crucial because they directly translated into advertising revenue.

టీఆర్పీ రేటింగ్ స్కామ్ లో రిపబ్లిక్ టీవి.. అర్నబ్ ను ప్రశ్నించనున్న పోలీసులు

Posted: 10/09/2020 08:45 PM IST
Republic tv trp fraud busted mumbai police set to quiz arnab goswami

అక్రమ మార్గాల ద్వారా తమ టీవీ వీక్షకుల సంఖ్యను పెంచుకుని టీఆర్పీ రేటింగ్ లపై ప్రభావితం చేసిన టీవీ ఛానెల్ల గుట్టును పోలీసులు రట్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును చేధించిన మహారాష్ట్రకు చెందిన ముంబై పోలీసులు పలు ఛానెళ్లు మోసాలకు పాల్పడి టీఆర్పీ రేటింగ్ ను ప్రభావితం చేస్తూన్నాయని వెల్లడించారు. తద్వారా తమ టీవీ చానెళ్లలో వ్యాపార ప్రకటనలను భారీగా పెంచుకోవడంతో పాటు టారిఫ్ రేట్లు కూడా భారీగా వడ్డించేందుకు ప్రయత్నించాయని తెలిపారు. ఈ తరహాలో మహారాష్ట్రకు చెందిన రెండు మరాఠీ ఛానెళ్లు అక్రమాలకు పాల్పడినట్టు తెలిపిన పోలీసులు ఈ జాబితాలో జాతీయ ఛానెల్ రిపబ్లిక్ టీవీ కూడా ఉందని తేల్చడంతో మీడియా వర్గాల్లో ఈ వార్త పెను సంచలనంగా మారింది.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశామని చెప్పిన ముంబై పోలీస్ కమీషనర్ పరమ్ వీర్ సింగ్ ఇక జాతీయ ఛానెల్ రిపబ్లిక్ టీవీ యాజమాన్యాని కూడా త్వరలోనే విచారిస్తామని అన్నారు. అరెస్టుచేసిన వారిలో టీఆర్పీ రేటింగ్ సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన పీపుల్ మీటర్ల ఏజెన్సీకి చంెదిన మాజీ ఉద్యోగిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే కేంద్ర ప ప్రభుత్వానికి ఇచ్చామని అన్నారు. ఇక ప్రకటనకర్తల నుంచి ఆయా టీవీ ఛానెళ్లు వసూలు చేసిన డబ్బులను, వారి నుంచి అందుకున్న నిధులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ వ్యవహారంలో ఎంతటి వారి వున్నా విచారిస్తామని పరోక్షంగా అర్నబ్ గోస్వామికి పోలీసులు అల్టిమేటం జారీ చేశారు.

ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య, ఆపై ముంబై పోలీసులపై వచ్చిన ఆరోపణల వార్తల విషయంలో ఈ చానెళ్లు అతిగా ప్రవర్తించాయని, తమ కార్యక్రమాలను అత్యధికులు చూస్తున్నారని బయటకు చెబుతూ, అధిక డబ్బులను ప్రకటనకర్తల నుంచి వసూలు చేశారని, ఈ కేసులో ఇద్దరు టీవీ చానెల్ యజమానులను అరెస్ట్ చేశామని తెలిపారు. కాగా, తమపై వచ్చిన ఆరోపణలపై అర్నాబ్ గోస్వామి నేతృత్వంలోని రిపబ్లిక్ టీవీ స్పందిస్తూ, సుశాంత్ విషయంలో తమ కవరేజ్ తరువాత, చానెల్ ను టార్గెట్ గా చేసుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. సుశాంత్ ఆత్మహత్య తరువాత పోలీసులను తాము ప్రశ్నించడమే తప్పయిపోయిందని చానెల్ ఓ ప్రకటనలో పేర్కొంది. తమను ఇరికించాలని చూస్తున్న ముంబై పోలీసులపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai Police  Param Bir Singh  India news  TRP Ratings  news channels  Republic TV  

Other Articles