A Female-Only Island SuperShe Island మహిళలకు మాత్రమే ప్రవేశం కల్పించే ద్వీపం..

No men are allowed on supershe island in finland

No men are allowed on SuperShe Island, female-only island, Entrepreneur, Kristina Roth, Baltic Sea, coast of Finland, SuperShe Island, Finland

Entrepreneur Kristina Roth actually made that happen. She's not just escaping to an island, she owns it. And she’s opening it up to women worldwide. But men? They’re not allowed. SuperShe Island is tucked away in the Baltic Sea off the coast of Finland. The 8.4-acre (literal) no man’s land features four newly renovated cabins and can accommodate 10 people.

మహిళలకు మాత్రమే ప్రవేశం కల్పించే ద్వీపం.. సూపర్ షీ

Posted: 09/16/2020 01:31 AM IST
No men are allowed on supershe island in finland

ప్రపంచవ్యాప్తంగా లక్షలాధి పర్యాటక స్థలాలు వున్నాయి. అందులో అందరి మనస్సులను దోచే పర్యాటక ద్వీపాలు కూడా వున్నాయి, ఇక్కడి బీచుల్లో చిన్నా, పెద్దా, ఆడ-మగ తేడా లేకుండా సందర్శకులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతుంటారు. అయితే ప్రతీ ఏటా లక్షల సంఖ్యలాది మంది సందర్శకులు పర్యాటక స్థలాలను పర్యటిస్తూవుంటారు. ఇక ఇందులో ద్వీపాల పర్యటన మాత్రం ప్రత్యేకం. వీటిని పర్యటించే సందర్శకులకు అక్కడి అధికారులు సాదరంగా స్వాగతం పలుకుతారు. అయితే ఇలా కుటుంబసమేతంగా లేదా నూతన వధూవరులు వెళ్తే పర్యాటక ద్వీపాలు అనేకం వున్నా.. ఫిన్ లాండ్ లోని ఓ సూపర్ షీ ద్వీపం మాత్రం ప్రత్యేకం. ఎందుకంటారా.. ఎవరు అక్కడికి పర్యాటకానికి వెళ్లినా అక్కడి సిబ్బంది రానీవ్వరు. అయితే కేవలం మహిళలకు మాత్రమే అక్కడ ప్రవేశం లభిస్తోంది. మగవాళ్లకు లేదా పురుషులకు మాత్రం అనుమతి నిరాకరించబడుతోంది. ఈ వార్తలతోనే ఈ ఫిన్ లాండ్ ద్వీపం రికార్డు పుటలకు ఎక్కింది. ఆ ఐలాండ్‌ విశేషాలేంటో తెలుసా..

సూపర్ షీ ద్వీపం.. ఇది మహిళలకు మాత్రమే ప్రత్యేకం.. పురుషులకు లేదు ప్రవేశం. ఇంతవరకు తెలిసినా.. ఇది అమెరికాకు సమీపంలోని ఫిన్ లాండ్‌ తీరప్రాంతంలో వుంది. దీని విస్తీర్ణం 8.4 ఎకరాలు. అమెరికాకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త క్రిస్టినా రోత్‌ ఈ ఐలాండ్ కు యజమానురాలు. కుటుంబం, ఉద్యోగ సంస్థ బృందంతో మహిళలు పర్యాటక స్థలాలకు వచ్చినా.. వారికి ఎలాంటి ప్రత్యేకత వుండదని అయితే తమ రిసార్టుకు వస్తే మాత్రం వారు తమకు కావాల్సిన విధంగా ఎలాంటి అంక్షలు, అక్షేపణలు లేకుండా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపవచ్చునని క్రిస్టినా రోత్ అభిప్రాయపడ్డారు.

దీంతో ఈ ద్వీపాన్ని కేవలం మహిళ కోసం మాత్రమే రూపుదిద్దిన అమె ఇక్కడ ఓ రిసార్టు ఏర్పాటు చేశారు. దీంతో కొన్నాళ్ల కిందట ఈ ఐలాండ్ లో ఓ రిసార్టు ఏర్పాటు చేసి కేవలం స్త్రీలకు మాత్రమే సేద తీరేందుకు అనుమతి ఇస్తున్నారు. ఇక్కడ అతిథుల కోసం ప్రత్యేక గదులు, స్పా, అడ్వెంచర్‌ యాక్టివిటీస్‌ ఉన్నాయి. అలాగే రకరకాల వంటలను నచ్చిన విధంగా వండి పెట్టడానికి ప్రత్యేకంగా వంట మనిషి కూడా ఉంది. కావాలంటే పర్యటకులే స్వయంగా వండుకునే సదుపాయం ఉంది. యోగ, ధ్యానం చేయించే క్లాసులు ఉంటాయి. ఐలాండ్‌ మొత్తం విహరిస్తూ.. ప్రశాంతంగా సేద తీరొచ్చు.

ఈ సూపర్‌ షీ ఐలాండ్ కు మొదట్లో కేవలం క్రిస్టినా, ఆమె స్నేహితులు మాత్రమే వచ్చేవారు. ఆ తర్వాత దీనిని పర్యటక ప్రాంతంగా మార్చేశారు. బంధువులు, స్నేహితులు, ఉద్యోగులు ఎవరైనా సరే కనీసం పది మంది మహిళలు బృందంగా ఏర్పడి ఈ ఐలాండ్ ను బుక్‌ చేసుకోవచ్చు. పురుషాధిక్య సమాజంలో స్త్రీలు మానసిక ఆనందాలకు నోచుకోవట్లేదని, విహారయాత్రలకు కుటుంబంతో వెళ్లినా, ఉద్యోగుల బృందంతో వెళ్లినా వారికి అంతగా స్వేచ్ఛ ఉండదని క్రిస్టినా అభిప్రాయం. అందుకే వారి కోసం ప్రత్యేకంగా ఈ ఐలాండ్‌ రిసార్టు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఇక్కడ ప్రపంచానికి, కట్టుబాట్లకు, ముఖ్యంగా మగవారికి దూరంగా నచ్చినట్లుగా గడపొచ్చని, ఒకరినొకరు మనసు విప్పి మాట్లాడుకోవచ్చని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles