High Court extends status quo uptill Sep 21 మూడు రాజధానులపై సెప్టెంబర్ 21 వరకు స్టేటస్ కో విధించిన హైకోర్టు

Andhra pradesh high court extends status quo till september 21 on three capital issue

High Court bench, Amaravati, Capital, CRDA, Justice Rakesh Kumar, Justice AV Sesha Sai, Justice M Satyanarayana Murthy, Ministry of Home Affairs, Supreme Court

The petition against three capitals and the CRDA repeal bills was heard in the Andhra Pradesh High Court. The High Court has extended the status quo till next month September 21 and adjourned the hearing to September 21. The tribunal said Status quo would continue without enforcing capital bills.

పాలన వికేంద్రీకరణపై సెప్టెంబర్ 21 వరకు స్టేటస్ కో విధించిన హైకోర్టు

Posted: 08/27/2020 03:46 PM IST
Andhra pradesh high court extends status quo till september 21 on three capital issue

ఆంధ్రప్రదేశ్ రాజధాని, సీఆర్డీఏ రద్దు అంశానికి సంబంధించి కేసును త్వరితగతిన పరిష్కరించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశించిన నేపథ్యంలో ఈ కేసు రోజువారిగా విచారించేందుకు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు నిర్ణయించింది. ఈ కేసు విచారణ నేపథ్యంలో సెప్టెంబర్ 21 వరకు పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు అంశాలపై స్టేటస్ కోను పోడగించింది, కేసు తదుపరి విచారణను కూడా అప్పటికీ వాయిదా వేసింది. ఈ విషయంపై కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి సెప్టెంబరు 11 వరకు ధర్మాసనం గడువు ఇచ్చింది. అభ్యంతరాలు చెప్పేందుకు పిటిషనర్లకు సెప్టెంబరు 17 వరకు గడువు ఇచ్చింది. 

ఈ మేరకు అమరావతి జేఏసీ సహా స్థానిక రైతులతో పాటు పలువురు దాఖలు చేసిన పిటీషన్లపై ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది నితీశ్‌ గుప్తా కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. విశాఖపట్నంలోని కాపులుప్పాడలో ఏపీ సర్కారు అతిథి గృహాన్ని నిర్మించనుందని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో అమల్లో ఉన్న సమయంలో అతిథిగృహం నిర్మాణానికి శంకుస్థాపన చేశారని ఆయన చెప్పారు. కార్యనిర్వాహక రాజధాని తరలింపులో ఇది కూడా ఒక భాగమేనని ఆయన తెలిపారు.

దీనిపై కూడా వచ్చేనెల 10 లోపు కౌంటరు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. సర్వోన్నత న్యాయస్థానం అదేశాల మేరకు వచ్చే నెల 21 నుంచి రోజువారి విచారణను చేపట్టనున్నట్లు కూడా స్పష్టం చేసింది. కాగా, స్టేటస్ కోను ఎత్తేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించడం, హైకోర్టు విచారణలో జోక్యం చేసుకోమంటూ ఆ పిటిషన్లను నిన్న జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ , జస్టిస్‌ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చడం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles