High Court Has One More Shock For Jagan Govt రాజధాని తరలింపుపై హైకోర్టు స్టేటస్ కో..

Andhra pradesh high court extends status quo on three capital bills to august 27

Amaravathi, JAC protest, status quo, extended, High court, Telangana, Andhra Pradesh, Y S jagan, TDP, YSRCP, Vizag, capital, Supreme court, Andhra pradesh

The Andhra Pradesh High Court has further extended the status quo on the ruling YSRCP government’s move to decentralise the capital, to August 27. This prevents the state government from taking any steps on the issue until further orders. In a previous hearing, the court had extended the stay till August 14.

రాజధాని తరలింపుపై హైకోర్టు స్టేటస్ కో.. 27న తదుపరి విచారణ

Posted: 08/14/2020 07:20 PM IST
Andhra pradesh high court extends status quo on three capital bills to august 27

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోమారు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో చుక్కెదురైంది, మూడు రాజధానుల అంశంలో వేగంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై న్యాయస్థానం పెదవి విరిచింది, అంతేకాదు అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు విషయంలో ప్రభుత్వం వేగవంతం చేసిన చర్యలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది, ఈనెల 27వ తేదీ వరకూ యథాతథ స్థితి (స్టేటస్‌ కో) పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దుచేస్తూ ప్రభుత్వం జారీచేసిన గెజిట్‌ ప్రకటనలు, చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన దాఖలైన దాదాపు 55 పిటిషన్లపై శుక్రవారం జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

మూడు రాజధానులు అనేవి విభజన చట్టానికి విరుద్ధమని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. విభజన చట్టంలో ఒక్క రాజధాని ప్రస్తావన మాత్రమే ఉందని వివరించారు. పిటిషన్లను ప్రత్యక్ష పద్ధతిలో విచారించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు కోరగా... కొవిడ్‌ వల్ల  ప్రత్యక్ష విచారణకు హాజరుకాలేమని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు తెలిపారు. గతంలో ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వుల గడువు ఇవాళ్టితో ముగుస్తుందని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకురాగా.. స్టేటస్‌కో ఉత్తర్వులు ఈనెల 27వరకు అమల్లో ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టాల అమలుపై ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles