Supreme Court Issues Notices To Ramoji Rao రామోజీరావుకు సుప్రీంకోర్టు నోటీసులు

Margadarsi chits and finance case sc issues notices to ramoji rao

Ramoji Rao, margadarsi chits, margadarsi finance, undivided share in margadarsi chits, margadarsi chits and finance, supreme court, SC Notices, Undavalli Arun Kumar, Andhra Pradesh, Politics, Crime

In what could be seen as a significant development in the Margadarsi case, the Supreme Court on Monday issued notices to Ramoji Rao and Margadarsi Financiers. The apex court heard a petition filed by former MP Undavalli Arun Kumar challenging the verdict of the estwhile unified Andhra Pradesh high court in the case.

ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావుకు సుప్రీంకోర్టు నోటీసులు

Posted: 08/10/2020 09:40 PM IST
Margadarsi chits and finance case sc issues notices to ramoji rao

(Image source from: Mirchi9.com)

ఏళ్ల క్రితం సంచలనంగా మారిన మార్గదర్శి కేసు మరోమారు వెలుగులోకి వచ్చింది. ఈ కేసును విచారించనున్న నేపథ్యంలో ఈనాడు సంస్థల అధినేత (చైర్మన్) రామోజీరావుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రామోజీరావుతో పాటు మార్గదర్శి ఫైనాన్షియర్లకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేయడాన్ని సవాల్ చేస్తూ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, మాజీ ఐజీ కృష్ణంరాజును ఇంప్లీడ్‌ చేసేందుకు అనుమతినిచ్చింది.

రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి ద్వారా రూ. 2,600 కోట్లను డిపాజిట్ల రూపంలో రామోజీరావు సేకరించారని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉండవల్లి పిటిషన్ వేశారు. ఈ మేరకు జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం నోటీసులు జారీ చేసింది. కాగా, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు రూ.2,600 కోట్లు డిపాజిట్లు సేకరించారని మాజీ ఐజీ కృష్ణంరాజు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌యుఎఫ్ (హిందూ జాయింట్‌ ఫ్యామిలీ) వ్యక్తుల సమూహం కాదని, ఆర్బీఐ నిబంధనలు వర్తించవని ఉమ్మడి హైకోర్టు విభజనకు ఒకరోజు ముందు జస్టిస్‌ రజిని రామోజీరావుపై కేసును కొట్టివేశారు.

ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసును ఉమ్మడి హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తున్నారు. ఈకేసులో ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఇంప్లీడ్‌ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. రామోజీ, మార్గదర్శి ఫైనాన్స్, తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం, కృష్ణంరాజుకు నోటీసులను జారీ చేసింది. తమ నోటీసులకు లిఖిత పూర్వక సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. సమాధానాలు అందిన తర్వాత తదుపరి విచారణను చేపట్టనున్నట్టు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles