Kadiyam and Ambati tested corona positive ప్రకాశంలో విషాదం.. శానిటైజర్ తాగి 9 మంది మృతి..

9 die in andhra pradesh after consuming hand sanitiser in absence of alcohol

Coronavirus, Covid -19, alcohol, death, Hand sanitiser, Kurichedu, Prakasam, Liquor shops closed, Lockdown, Methenol, Andhra Pradesh, Telangana

Unable to get alcohol, Nine people died after drinking alcohol-based hand sanitiser in Prakasam District, Andhra Pradesh, said the police on Friday. The incident happened in Kurichedu town. One person died late on Wednesday night and two others died on Thursday night. Six others also succumbed on Friday morning.

మద్యం దొరక్క శానిటైజర్.. ప్రకాశంలో విషాదం, 9 మంది మృతి..

Posted: 07/31/2020 02:07 PM IST
9 die in andhra pradesh after consuming hand sanitiser in absence of alcohol

(Image source from: hindi.sakshi.com)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తొమ్మది మంది పాలిట శాఫంగా మారింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో మద్యం లభ్యం కాకపోవడంతో చేతులను శుభ్రం చేసుకునే హ్యాండ్ శానిటైజర్ ను సేవించడంతో అసువులు బాసారు. కరోనా వైరస్ ఉద్దృతి అంతకంతకూ పెరుగుతన్న క్రమంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై పది రోజుల క్రితమే ఏపీ సర్కార్ నిషేదం విధించింది. దీంతో తొలుత ఒకరు మరణించగా, క్రమంగా ఇవాళ ఉదయానికి ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది. ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

స్థానికంగా పెను సంచలనంగా మారిన ఈ ఘటనలో వివరాల్లోకి వెళ్తే.. గత పది రోజులుగా మద్యం దుకాణాలు తెరవకపోవడంతో గత కొన్ని రోజులుగా మద్యానికి అలవాటు పడిన కొందరు శానిటైజర్లను తీసుకుని సేవిస్తున్నారు. ఇలా సేవించిన వారిలో ఒక్కరుగా ఇవాళ ఉదయానికి ఏకంగా తొమ్మది మంది మరణించారు. అయితే శానిటైజర్లను తాగడం మాత్రం స్థానిక అమ్మవారి ఆలయం వద్ద ఉండే ఇద్దరు యాచకులు ప్రారంభించారని తెలుస్తోంది. వీరు మద్యానికి బానిసలై.. మద్యం లభించకపోవడంతో.. మరో మార్గం లేక వీరు కొన్ని రోజులుగా శానిటైజర్లు తాగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఇలా శానిటైజర్ తాగిన వారిలో ఓ వ్యక్తి గురువారం రాత్రి కడుపులో తీవ్ర మంటతో చనిపోయాడు. కాగా మరో యాచకుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటుండగా స్థానికులు 108కి సమాచారం అందించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.

కానీ వారి ప్రయత్నాలన్నీ నిష్పలమయ్యాయి, 108 సిబ్బంది బాధితుడ్ని దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతను మరణించాడు. ఇదే విధంగా కురిచేడులోని పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో నివాసం ఉండే కడియం రమణయ్య(28) గురువారం ఉదయం శానిటైజర్‌, నాటు సారా కలిపి తాగుతుండగా స్థానికులు గుర్తించి వారించారు. అయినప్పటికీ ఆయన తాగి ఇంటికి వెళ్లిపోయాడు. రాత్రి  తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. దీంతో రమణయ్యను కుటుంబసభ్యులు 108 అంబులెన్సు సమాచారం ఇచ్చారు. 108 అంబులెన్సులో దర్శి ఆసుపత్రికి తీసుకెళ్లగా మార్గమధ్యంలోనే రమణయ్య చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు.

ఇక ఇదే విధంగా శానిటైజర్ ను మద్యంలా భావించి సేవించిన మరో ఆరుగురు కూడా అనంతవాయువులలో కలసిపోయారు. ఇవాళ ఉదయం ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. శానిటైజర్ మద్యం కాదని, అందులో మెథానాల్ అనే రసాయనం వుంటుందని, అది విషపూరితమైనదని వైద్యులు పేర్కోంటున్నారు. చేతులను శుభ్రపర్చేందుక మాత్రమే.. అందులోనూ వైరస్ ను సంహారిణి మనుషులకు సేవించడానికి వీలులేదని ఇది పూర్తిగా హానికరమని చెబుతున్నారు. ఇక కురిచేడులో శానిటైజర్ సేవించి ఇవాళ మరణించిన వారిని అనుగొండ శ్రీను (25), భోగెమ్‌ తిరుపతయ్య(37), గుంటక రామిరెడ్డి(60, కడియం రమణయ్య(28) రమణయ్య(65), రాజారెడ్డి(65), బాబు(40), ఛార్లెస్‌ (45), అగస్టీన్‌(47)గా గుర్తించారు. కరోనా కేసులు పెరగడంతో కురిచేడు ప్రాంతంలో లాక్ డౌన్‌ విధించిన నేపథ్యంలో ఈ ఘటన సంభవించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles