Ayurvedic medicines for COVID-19 కరోనా కట్టడికి ఆయుర్వేద ఔషదం.. క్లినికల్ ట్రయల్స్..

India us ayurvedic experts to jointly conduct clinical trials

ayurveda, ayurveda trials, coronavirus, coronavirus pandemic, coronavirus outbreak, coronavirus treatment, ayurveda for coronavirus, coronavirus treatment by ayurveda, US on ayurveda for coronavirus, COVID-19, India US relations

The Ayurvedic practitioners and researchers in India and the US are planning to initiate joint clinical trials for Ayurveda formulations against novel coronavirus. Indian Ambassador to the US Taranjit Singh Sandhu said the vast network of institutional engagements have brought scientific communities between the two countries together in the fight against COVID-19.

కరోనా కట్టడికి ఆయుర్వేద ఔషదం.. క్లినికల్ ట్రయల్స్..

Posted: 07/09/2020 07:14 PM IST
India us ayurvedic experts to jointly conduct clinical trials

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు పరిశోధనలు ప్రారంభించాయి. అలోపతి మెడిసిన్ లో రెమిడెసివీర్ మందును కూడా బాధితులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే మరోవైపు ఈ మహమ్మారి నియంత్రణకు అలోపతిలోనే కాక ఆయుర్వేదంలోనూ ఔషదాన్ని కనుగొనే ప్రయత్నాలు కూడా కొనసాగాయి. ప్రస్తుతం కరోనా ఆయుర్వేద ఔషదంపై క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి, భారత్‌, అమెరికాలోని ఆయుర్వేద నిపుణులు, పరిశోధకులు ఇందుకోసం ఏకమయ్యారు.

ఆయుర్వేద మందులతో సంయుక్తంగా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సిద్ధమయ్యారని వాషింగ్టన్ లోని భారత రాయబారి తరణ్ జీత్ సింగ్‌ సంధూ అన్నారు. భారత్‌, అమెరికాకు చెందిన నిపుణులు, పరిశోధకులు, విద్యావేత్తలు, వైద్యులు వర్చువల్‌ సమావేశంలో పాల్గొని ఆయుర్వేద శాస్త్రంలో కరోనా మహమ్మారికి ఔషదాన్ని కనుగొనేందుకు ఒక్క కూటమిగా ఏర్పడ్డారని తరణ్ జీత్‌ వెల్లడించారు. కొవిడ్‌ -19పై పోరాడేందుకు వీరంతా ఒక్కతాటిపైకి వచ్చారని తెలిపారు. ‘సంయుక్త పరిశోధన, బోధన, శిక్షణ కార్యక్రమాల ద్వారా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేందుకు మా సంస్థలన్నీ సహకరిస్తున్నాయి. కరోనా వైరస్‌పై క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపేందుకు రెండు దేశాల ఆయుర్వేద నిపుణులు, పరిశోధకులు చేతులు కలిపారు’ అని సంధూ తెలిపారు.

తమ శాస్త్రవేత్తలు ఆయుర్వేద రంగంలో తమకున్న అనుభవం, విజ్ఞానం, పరిశోధన అంశాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు సమ్మతించారరని తరణ్ జీత్‌ తెలిపారు. భారత్‌, అమెరికా శాస్త్ర సాంకేతిక వేదిక (ఐయూఎస్‌ఎస్‌టీఎఫ్‌) తమకొచ్చిన ప్రతిపాదనలు వేగంగా పరిష్కరిస్తోందని పేర్కొన్నారు. భారత ఔషధ కంపెనీలు ప్రపంచంలోనే అతితక్కువ ధరకే మందులు, వ్యాక్సిన్లను అందించే స్థాయికి ఎదిగాయని ప్రశంసించారు. మహమ్మారిపై పోరాటంలోనూ కీలక పాత్ర పోషిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత వ్యాక్సిన్‌ కంపెనీలు, అమెరికా సంస్థల మధ్య కనీసం మూడు సహకార ఒప్పందాలు కొనసాగుతున్నాయన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles