Groom's family fined after wedding వరుడి కుటుంబంలో విషాదం.. భారీగా అపరాద రుసం..

Grooms family fined after wedding leaves 1 dead 15 covid infected

coronavirus, bridegroom dad fined, lavish wedding, Bhilwara, FIR, grooms family, grooms dad fined, corona norms violation, COVID-19 guidelines, Rajasthan Epidemic Diseases Act, National Diaster Management, COVID-19, quarantine, Rajasthan

The urgency to conduct a lavish wedding with guests amid the COVID-19 pandemic has cost a groom’s family in Rajasthan’s Bhilwara district a huge price – the death of the groom’s grandfather, a fine of ₹6 lakh, and an order to bear the treatment cost of 15 infected guests and the isolation fee of 58 quarantined guests.

వరుడి కుటుంబంలో విషాదం.. భారీగా అపరాద రుసం..

Posted: 07/02/2020 10:08 PM IST
Grooms family fined after wedding leaves 1 dead 15 covid infected

రాజస్థాన్ లోని బిల్వాడా జిల్లాలో జరిగిన ఓ వివాహం వరుడి కుటుంబాన్ని విషాదం నింపింది. ఓ వైపు తన తాతయ్యను కోల్పోయిన వరుడి కుటుంబానికి అదే సమయంలో భారీగా అపరాద రుసం కూడా చెల్లించాల్సి వచ్చింది. కరోనా మహమ్మారి జడలు విప్పి కరాళ నృత్యం చేస్తున్న తరుణంలో తమ బంధువుల ప్రాణాలను పన్నంగా పెట్టి అంగరంగ వైభవంగా తన తనయుడి కళ్యాణం నిర్వహించడంతో విషాదంతో పాటు భారీగా జరిమానా పడింది. కరోనా సమయంలో లాక్ డౌన్ సహా అంటువ్యాధుల చట్టాన్ని అతిక్రమించి వివాహం చేయడంతో పాటు పలువురికి కరోనా సోకేలా వ్యవహరించిన కారణంగా రూ.6.26 లక్షల జరిమానా కట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.

అంతేకాదు వారి వివాహానికి హజరై.. కరోనా సోకిన బంధువుల క్వారంటైన్‌లో ఉన్నవారి ఖర్చులు భరించాలని రాజస్థాన ప్రభుత్వం వరుడి కుటుంబాన్ని అదేశించింది.  భడాడా ప్రాంతానికి చెందిన ఓ బడా వ్యాపారవేత్త జూన్ 13న తన కుమారుడి వివాహాన్ని వైభవంగా జరిపాడు. 50 మందినే ఆహ్వానించి శానిటైజర్లు, మాస్కులు అందించి భౌతిక దూరం పాటించేలా చూస్తానని ప్రభుత్వం వద్ద అనుమతి తీసుకున్నప్పటికీ ఆ నియమాలను బేఖాతరు చేశాడు. మూడు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించగా దాదాపు వేయి మంది అతిథులు హాజరయ్యారు. అయితే ఈ వివాహానికి హాజరై వెళ్లిన తరువాత ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. దాంతో అంతకు వారం రోజుల ముందు అతను ఎక్కడెక్కడికి వెళ్లాడన్న వివరాలు కనుకొన్న అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.

తాను వారం రోజుల ముందు ఓ పెళ్లికి హజరయ్యానని, ఆ వివాహవేడుకకు ఏకంగా వెయ్యి మంది హాజరయ్యారని తెలపడంతో షాక్ తిన్న అధికారులు.. వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం వధూవరులిద్దరితో పాటు వరుడి తండ్రి, తాతతో సహా 16 మంది వ్యాధి బారిన పడ్డట్లుగా నిర్ధరించుకున్నారు. వైరస్‌తో వరుడి తాత మృతిచెందాడని కూడా నిర్థారించుకుని. మరో 58 మందిని అధికారులు హోం క్వారంటైన్ లో ఉంచారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా ప్రోటోకాల్ ను ఉల్లంఘించారంటూ వరుడి కుటుంబసభ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించారు. ప్రభుత్వ నిబంధనల అతిక్రమణ కింద రూ.6.26 లక్షల జరిమానా విధించారు. దీనితోపాటు వైరస్‌ సోకిన వారి చికిత్సకు అయ్యే ఖర్చును భరించాలని పేర్కొన్నారు. హోం క్వారంటైన్లో ఉన్న వారికి నిత్యావసరాల ఖర్చులు అందివ్వాలని ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  bridegroom dad fined  lavish wedding  Bhilwara  COVID-19  quarantine  Rajasthan  

Other Articles