TDP MLA Atchannaidu, former director arrested ఈఎస్ఐ స్కాములో విజయవాడకు అచెన్న.. అదుపులో మాజీ డైరెక్టర్..

Esi medicine scam tdp mla atchannaidu former director arrested

K Atchannaidu arrested, tdp mla arrested, tdp mla arrested medicine procurement scam, K Atchannaidu scam, Kinjarapu Acchamnaidu, ACB, nimmada, tekkali, sriTelangana, Hyderabad, Secret Place, Raids, social media, coronavirus, Andhra pradesh, politics

TDP MLA from Tekkali in Andhra Pradesh, K Atchannaidu, was on Friday arrested by the Anti-Corruption Bureau (ACB) for his alleged involvement the procurement of medicines for ESI hospitals when he was a minister in the N Chandrababu Naidu Government.

ఈఎస్ఐ స్కాములో విజయవాడకు అచెన్న.. అదుపులో మాజీ డైరెక్టర్..

Posted: 06/12/2020 03:41 PM IST
Esi medicine scam tdp mla atchannaidu former director arrested

ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఈ తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఆయనను విజయవాడకు తరలించారు. ఈ అరెస్టు నేపథ్యంలో అచ్చెన్న ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. రాత్రిపూట పోలీసులు ఏకంగా దొంగలను అరెస్టు చేసినట్టుగా గేట్లు దూకి లోపకి వచ్చి మరీ అరెస్టు చేశారు. ముందుగా అచ్చెన్న ఇంటికి తనిఖీల కోసం వచ్చామని చెప్పిన పోలీసులు.. వెనువెంటనే అరెస్టుకు తెరలేపారు. అసలేం జరుగుతుందో అర్థం చేసుకునేలోపు ఆయన అదుపులోకి తీసుకుని.. హుటాహుటిన విజయవాడకు తరలిందారు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపగా.. అచ్చెన్నాయుడి అరెస్టుకు ఆయన హయాంలో జరిగిన ఈఎస్ఐ కుంభకోణమే కారణంగా పోలీసులు పేర్కోన్నారు.

2014 నుంచి 2019 వరకూ కొనసాగిన గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అచ్చెన్నాయుడు  ఏపీ కార్మిక మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. ఆ సమయంలో ఈఎస్ఐలో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, ప్రస్తుత కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం నేతృత్వంలోని విచారణ కమిటీ ఇప్పటికే, ప్రాథమిక, మధ్యంతర నివేదికలను సమర్పించగా, కాలం తీరిన మందులు కొన్నారని తేలింది. ఇదే సమయంలో అర్హత లేని కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారని, దాదాపు రూ. 900 కోట్ల అక్రమాలు జరిగి వుంటాయని అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో దాదాపు 200 మంది ఏసీబీ  అధికారులు 100 మంది పోలీసుల సాయంతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి పరిధిలోని నిమ్మాడకు చేరుకుని ఆయన ఇంటిపై సోదాలు నిర్వహించి అరెస్టు చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో నిమ్మాడలో ఆయనను అరెస్టు చేసిన అధికారులు.. అదే సమయంలో మరో పోలీసు అధికారుల బృందం ఈఎస్ఐ శాఖ డైరెక్టర్ గా వ్యవహరించిన రమేష్ కుమార్ ను కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుంది, ఆయన తిరుపతిలో నివాసం ఉంటుండగా, గత రాత్రి, అచ్చెన్నాయుడితో పాటు, ఆయన ఇంటిపైనా ఏకకాలంలో దాడులు చేసిన అధికారులు, ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ స్కామ్ లో ఆయనపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదిలావుండగా, అచ్చెన్నాయుడు చొరవతోనే రూ. 975 కోట్ల మందులను కొనుగోలు చేసిన అధికారులు, రూ. 100 కోట్లకు పైగా నకిలీ బిల్లులను సృష్టించారని గతంలోనే ఆరోపణలు వచ్చాయి. మందుల కొనుగోలు నిమిత్తం రూ. 293 కోట్లు కేటాయించగా, రూ. 698 విలువైన మందులను కొని, ఖజానాకు రూ. 405 కోట్ల నష్టం కలిగించారన్న ఆరోపణలపై ఏసీబీ విచారణ ప్రారంభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles