Tirumala opens doors to devotees today తిరుమలకు పోటెత్తిన భక్తులు.. బౌతిక దూరం దేవుడిపైనే భారం..

Darshan for common devotees resumes at tirumala temple

travel relaxation, travel advisory, Tirumala Tirupati Devasthanams, devotees, pilgrim, TTD Chairman YV Subba Reddy, Tirumala temple, strict precautionary measures, Lord Venkateshwara temple, covid-19 pandemic, devotees, social distancing, darshan queues, coronavirus, YV Subba reddy, CM Jagan, Andhra Pradesh, Politics

The Lord Venkateshwara Temple in Tirumala reopened its door for devotees today, after remaining closed for almost 80 days. As per the reports, the Tirumala Tirupati Devasthanams (TTD) resumed Srivari darshan at Tirumala for devotees from today, after successfully conducting trial runs for three days.

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. బౌతిక దూరం దేవుడిపైనే భారం..

Posted: 06/11/2020 06:11 PM IST
Darshan for common devotees resumes at tirumala temple

కలియుగ వైకుంఠంగా ప్రసిద్దిగాంచిన తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని దర్శనాలు తిరిగి ప్రారంభమైయ్యాయి, కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన క్రమంలో తిరుమల శ్రీవారి దర్శనాలను నిలిపివేసిన అధికారులు ఏడుకొండలపై ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నారు. సుమారు 80 రోజుల తరువాత అన్ లాక్ 1.0కు కేంద్రం అనుమతలు మంజూరు చేయడంతో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తిరుపతిలోని అలిపిరిలోని బాలాజీ లింక్ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లో దర్శనసమయ టోకెన్లను జారీ చేయడం మొదలైన తరువాత, వేల మంది పోటెత్తారు. స్థానికులు పెద్ద సంఖ్యలో టోకెన్ జారీ కేంద్రాల వద్దకు చేరుకున్నారు.

వడ్డీకాసుల వాడిని దర్శించుకునే బాగ్యం కలుగుతుందన్న నేపథ్యంలో ఉదయం నుంచే టోకన్ల కోసం బారులు తీరిన భక్తులు.. టికెట్ల జారీ వరకు లైన్లో నిలబడినా.. ఆ తరువాత భక్తుల తాకిడి అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో బౌతిక దూరం అన్న పదమే కాదు.. ఆచరణలో కూడా పెద్దగా కనిపించలేదు. తమకు శ్రీవారి దర్శనం ఎంత త్వరగా లభిస్తుందా అన్న ఆతృతే భక్తుల్లో కనిబడింది కానీ.. కరోనా మహమ్మారి భయం మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో కరోనా భయం.. భౌతిక దూరం పాటించడం విషయాలను భక్తులు ఆ దేవదేవుడిపైనే భారం వేసినట్లు కనిపిస్తోంది.

అలిపిరి లింక్ బస్టాండ్ లో భక్తులను టీటీడీ సిబ్బంది దూరదూరంగా కూర్చోబెట్టారు. శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన టోకెన్ సెంటర్ నుంచి డీబీఆర్ హాస్పిటల్ వరకూ క్యూ లైన్ కనిపించింది. నిన్న సాయంత్రానికే ఈ నెల 14 వరకూ 15 వేల టోకెన్లను జారీ చేశారు. మొదట ఒక రోజుకు సరిపడా 3,700 టోకెన్లు ఇవ్వాలని భావించినా, భక్తులు వేల సంఖ్యలో రావడంతో దాదాపు 15 వేలకు పైగా టోకెన్లను జారీ చేశారు. ఇక నేడు మరో మూడు రోజులకు సరిపడినన్ని టోకెన్లు ఇస్తామని అధికారులు తెలిపారు. కాగా, అలిపిరి వద్దకు వచ్చే భక్తుల వద్ద ఉన్న దర్శన సమయం టోకెన్ పరిశీలించి, థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తరువాతనే కొండపైకి అనుమతిస్తున్నారు. తొలి రోజున శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉన్న సుమారు 300 మంది భక్తులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles