young woman shouts foil miscreants kidnap attempt పాతబస్తీలో యధేశ్చగా యువతి కిడ్నాప్ యత్నం..

Young woman shouts foil miscreants kidnap attempt in hyderabad old city

Coivd-19, coronavirus outbreak, Coronavirus, covid-19 kidnap in old city, kidnap attempt in old city, miscreants kidnap attempt, kidnap attemptin hyderabad, kidnap attempt in humayun nagar, miscreants, hyderbad old city, humayun nagar, young woman, kidnap, father, chilli powder, Hyderabad, Telangana, crime

Four Miscreants attempts to kidnap a young woman, who was accompinied by her father, from the limits of Humanyun nagar police station in old city o Hyerabad. The young woman louder shouts for help had foiled the attempt as the miscreants escaped within minutes.

ITEMVIDEOS: హైదరాబాద్ పాతబస్తీలో యధేశ్చగా యువతి కిడ్నాప్ యత్నం..

Posted: 04/17/2020 09:56 AM IST
Young woman shouts foil miscreants kidnap attempt in hyderabad old city

హైదరాబాద్ పాతబస్తీలో యువతి కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. తండ్రితో కలసి బయటకు వెళ్తున్న యువతిని కిడ్నాప్ చేసేందుకు దుండగలు విఫలయత్నం చేశారు. యావత్ దేశం లాక్ డౌన్ నేపథ్యంలో ఇళ్లకు మాత్రమే పరిమితం కాగా.. అక్రమాలు చేసే దుండగులు మాత్రం ఎలాంటి అడ్డు అదుపు లేకుండా నేరాలకు పాల్పడుతూనే వున్నారు. హుమాయన్ నగర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్లో నివాసముండే మహ్మద్ షరీఫ్‌ గురువారం మధ్యాహ్నం తన కూతురితో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారు.

అప్పటికే ఆ ఇంటి సమీపంలో వేచి చూస్తున్న కొందరు యువకులు వారిని చుట్టుముట్టారు. షరీఫ్ కూతురిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన షరీఫ్ వారిని తీవ్రంగా ప్రతిఘటించాడు. కూతురిని గట్టిగా పట్టుకుని వదల్లేదు. దీంతో రెచ్చిపోయిన దుండగులు అతడి తలపై బీరు బాటిళ్లతో దాడి చేసి కళ్లల్లో కారం కొట్టారు. అయినప్పటికీ ఆయన తన కూతురిని గట్టిగా పట్టుకుని వదల్లేదు. కొంతసేపటికి తండ్రి నుంచి యువతిని వేరు చేసిన దుండగులు ఆమెను కారులో ఎక్కించే ప్రయత్నం చేశారు. ఆ యువతి గట్టిగా కేకలు వేయడంతో వారంతా భయంతో ఆమెను విడిచిపెట్టి పరారయ్యారు.

నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన జరుగుతున్నా అందరూ ఇళ్లలోనే వుండటంతో ప్రతిఘటించే వారు లేకుండా పోయారు. కాగా ఈ అపహరణయత్నానికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ పుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదే ప్రాంతానికి చెందిన సల్మాన్ మీర్జా బేగ్‌, అతడి స్నేహితులుగా గుర్తించారు. అయితే వారు యువతిని ఎందుకు కిడ్నాప్ చేశారన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనిలో ప్రేమ వ్యవహారమేదైనా ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles