Farmer warns woman revenue employee in srikakulam పెట్రోల్ బాటిల్ తో మహిళా ఉద్యోగినికి రైతు బెదిరింపు!

Farmer warns of set ablaze of woman revenue employee on srikakulam

Jagan Mohan Rao, Srikakulam, Narasannapeta, dukalpalem, Rythu Bharosa meeting, Petrol bottle, Bride, Woman revenue staff, drain, Sumalatha, Police case, ysr kadapa district, Kondapuram, Adinarayana, Land Issue, Court, AP CM YS Jagan, Chief Minister, Andhra Pradesh, Politics

A farmer Allu Jagan Mohan Rao from srikakulam of Andhra Pradesh warns a woman revenue employee with a petrol bottle in hand, after she demanding bride for the compensation of the drain construted by the farmer in his farm at Rythu Bharosa Meeting.

"లంచం కావాలా?" పెట్రోల్ బాటిల్ తో మహిళా ఉద్యోగినికి రైతు బెదిరింపు!

Posted: 11/07/2019 03:21 PM IST
Farmer warns of set ablaze of woman revenue employee on srikakulam

తెలంగాణలో అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయంలో తన భూసమస్యను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ ఓ రైతు ఎమ్మార్వో విజయారెడ్డిపై పెట్రోల్ పోసి అత్యంత పాశవికంగా సజీవ దహనం చేసిన ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రెవెన్యూ ఉద్యోగుల పాలిట శాపంగా మారనుంది. ఇదే అస్త్రాన్ని తాము ఆచరిస్తామని తెలుగు రాష్ట్రాల రైతుల నుంచి రెవెన్యూ అధికారులకు బెదిరింపులు వస్తున్నాయి. ఎమ్మార్వో విజయారెడ్డి ఘటన జరిగి వారం రోజులు కూడా కాకముందే రెండు రాష్ట్రాల్లోని పలువురు రెవెన్యూ సిబ్బందికి ఈ బెదరింపులు వస్తున్నాయి.

తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో తాము చనిపోవడంతో పాటు అధికారులను కూడా అంతమొందిస్తామన్న బెదిరింపులు అధికమైపోయాయి. ఈ విషయాన్ని అటుంచితే.. రెవెన్యూ శాఖలోని సిబ్బంది ప్రజల నుంచి డబ్బులు తీసుకున్న విషయం కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు ఇదివరకే యాదాద్రి జిల్లాకు చెందిన ఓ విఆర్వో ఓ రైతుకు పాస్ పుస్తకాన్ని అందిస్తానని చెప్పి.. తాత్సారం చేసిన కారణంగా.. విజయారెడ్డి హత్యకు నిరసనగా వారు ఎమ్మార్వో అధికారి ఎదుటే నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఓ మహిళ వీఆర్వోను కొట్టినంత పనిచేసింది. అమె భర్త నిలువరించి వుండకపోతే.. అంతపని జరిగివుండేది. తామిచ్చిన డబ్బును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది.

ఇక స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా వైఎస్సార్ కడపలోని కొండాపురం మండలంలోని దత్తాపురంకు చెందిన బుడిగ ఆదినారాయణ తన భూమికి సంబంధించి సమస్యను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో అవేశానికి లోనైన ఆయన ఒంటిపై పెట్రోల్ పోసుకొన్నాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అడ్డుకున్నారు. అతడ్ని బయటకు తీసుకొచ్చి నీళ్లు పోయడంతో ప్రమాదం తప్పింది. ఇటు తెలంగాణలోని అదిలాబాద్ జిల్లాల్లో ఓ యువకుడు ఏకంగా కలెక్టర్ కార్యాలయంలో తన భూసమస్య విషయమై వస్తే ఎప్పుడూ కలక్టర్ కలసిన పాపన పోలేదని.. తాను పెట్రోల్ సీసాతో రావాలా.? అంటూ అవేదనకు లోనయ్యాడు.

ఇక తాజాగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం దూకలపాడులో రైతు భరోసా సభలోనూ ఓ రైతు పెట్రోల్ బాటిల్ తీసుకువచ్చి మహిళా ఉద్యోగినిని బెదిరించాడు. పంచాయతీ కార్యదర్శిని పనిచేస్తున్న జే సుమలత వద్దకు వచ్చిన అల్లు జగన్ మోహన్ రావు అనే వ్యక్తి, తన పొలంలో మురికి కాలువ తవ్వించారని, ప్రభుత్వ సాయం అందకుండా చేస్తున్నారని, లంచం అడుగుతున్నారని దూషించాడు. ముందుగానే బ్యాగులో ఉంచుకున్న పెట్రోల్ బాటిల్ ను బయటకు తీసి, దాన్ని పోసి అంటించి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగగా, అక్కడున్న వారంతా హడలిపోయారు.

ఆ వెంటనే స్పందించిన స్థానికులు అతన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ అక్కడున్న అధికారులు, ఇతరులపైనా పడింది. ఈలోగా అతను అగ్గిపెట్టెను తీయడంతో, మరింత ఆందోళనకు గురైన సదరు మహిళా అధికారిణితో పాటు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు పరుగులు తీశారు. జరిగిన ఘటనపై పంచాయతీ కార్యదర్శి సుమలత, పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి, రైతును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై డీపీవో సమీక్ష నిర్వహించగా, మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ఫోన్‌ లో సుమలతను పరామర్శించారు. అధైర్యపడవద్దని, నిర్భయంగా విధులు నిర్వహించాలని, తప్పులు జరగకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles