HC slams govt on secretariat issue తెలంగాణ సర్కారుకు హైకోర్టు అక్షింతలు.!

Why demolish 7 yr old building asks telangana high court

Telangana High Court, Secretariat building, prof PL Vishweswara Rao, justice Raghavendra Singh Chauhan, Justice A Abhishek Reddy, Telangana, Politics

The Telangana High Court asked the Chandrasekhar Rao government whether there is any need for demolishing existing buildings in Secretariat in Hyderabad.

సెక్రటేరియట్ కూల్చివేతపై కేసీఆర్ సర్కారుకు హైకోర్టు అక్షింతలు.!

Posted: 10/14/2019 05:47 PM IST
Why demolish 7 yr old building asks telangana high court

సచివాలయాన్ని కూల్చి కొత్తది నిర్మించాలన్న తెలంగాణ సర్కారు నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. తెలంగాణ సచివాలయం కూల్చివేతపై విశ్వేశ్వరరావు అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. సచివాలయాన్ని ఎందుకు కూల్చివేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ భవనానికి అగ్నిప్రమాదం ముప్పు ఉండడంతో కూల్చివేయాలన్న నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ తెలిపారు. దీనిపై ఫైర్ డిపార్ట్ మెంట్ నుంచి నివేదిక కూడా వచ్చిందని కోర్టుకు విన్నవించారు.

అయితే, అగ్నిమాపక శాఖ నివేదికలో అగ్నిప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని మాత్రమే ఉంది, భవనాలు కూల్చివేయాలని చెప్పలేదు అని కోర్టు వ్యాఖ్యానించింది. దాంతో, అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే చోట ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం అని ఏజీ పేర్కొనగా, ఏపీ ప్రభుత్వం ఖాళీ చేసిన భవనాలు ఉండగా కొత్తవాటితో పనేంటి? అని మరోసారి కోర్టు సూటిగా ప్రశ్నించింది.  

అదే సమయంలో పిటిషనర్ విశ్వేశ్వరావుకు కూడా కోర్టు అక్షింతలు వేసింది. పరిపాలన అంశాల్లో మీరు ఎలా జోక్యం చేసుకుంటారని ప్రశ్నించింది. ప్రజల ధనం దుర్వినియోగం అవుతోందన్న కారణంగా పిటిషన్ వేసినట్టు విశ్వేశ్వరరావు తరఫు న్యాయవాది బదులివ్వగా, సచివాలయ నిర్మాణం ప్రజల కోసం చేపడుతున్నదే కదా అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ విధంగా వాదోపవాదాలు సాగిన పిమ్మట విచారణ రేపటికి వాయిదా పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles