Man sets motorbike on fire on being challaned Rs 25000 డ్రంక్ అండ్ డ్రైవ్ లొ దొరికి.. ఫైన్ కట్టలేక బైక్ ను తగులబెట్టి..

Drunken rage delhi man fined rs 25 000 for drunk driving sets own bike on fire

Traffic Rules, Motor Vehicles Amendment Act, traffic cops, drunk and drive check, Motor Vehicle (Amendment) Act, Delhi Man Sets Bike On Fire, Bike Fire Motor Vehicle Act, Motor Vehicle Act Challan, Traffic Police Challan, Sarvodaya Enclave, Malviya nagar, Delhi, Crime news

A drunk man reportedly set his motorcycle on fire in South Delhi's Malviya Nagar area. Police claimed that his bike was impounded by traffic police.

డ్రంక్ అండ్ డ్రైవ్ లొ దొరికి.. ఫైన్ కట్టలేక బైక్ ను తగులబెట్టి..

Posted: 09/06/2019 11:27 AM IST
Drunken rage delhi man fined rs 25 000 for drunk driving sets own bike on fire

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తాజాగా అమల్లోకి తీసుకువచ్చిన సవరించిన మోటార్ వాహన చట్టంలోని జరిమానాల విషయం ఇంకా దేశంలోని అనేక మంది ప్రజల దృష్టికి వెళ్లనేలేదు. అయినా తాము నిర్థేశించిన తేదీ నుంచే కొత్త ట్రాఫిక్ రూల్స్ ను అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ నెల 1 నుంచే దానిని అమల్లోకి తెచ్చింది. దీంతో ఈ సవరణల గురించి తెలియని వాహనదారులను తమకు పడుతున్న జరిమానాలను చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు. వేలాది రూపాయలను జరిమానాలుగా వసూలు చేయడమేంటో అర్థంకాక.. అంతర్య బోధపడక దిక్కుతోచని స్థితికి చేరుకుంటున్నారు.

జరిమానా విషయం తెలిసి తెలియగానే తమలోని అక్రోశంతో ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని స్థితికి చేరకుంటున్నారు. ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చిన ప్రభుత్వాన్ని ఏమీ అనలేక.. తమ ఆగ్రహాన్ని తమకు చెందిన వస్తువులపైనే చూపిస్తున్నారు. తాజాగా, ఓ వ్యక్తి జరిమానా చెల్లించలేక తన ద్విచక్ర వాహనాన్ని అందరి ముందు తగలబెట్టేశాడు. ఢిల్లీలోని షేక్ సరాయి ఫేజ్-1లో ఈ  ఘటన చోటుచేసుకుంది. రాకేశ్ అనే యువకుడు మద్యం తాగి బైక్‌పై వెళ్తూ దొరికిపోయాడు. బ్రీత్ అనలైజర్ టెస్టులో ఆల్కహాల్ శాతం 200 పాయింట్లు దాటింది.

మద్యం తాగి బైక్ నడపడం ఓ నేరం అయితే, బైక్‌కు సంబంధించిన ఎటువంటి పత్రాలు అతడి వద్ద లేకపోవడం మరో తప్పు. దీంతో అతడికి పోలీసులు భారీ జరిమానా వడ్డించారు. జరిమానా చెల్లించేందుకు డబ్బులు లేవని చెప్పడంతో అతడి నుంచి పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకుని పక్కన పార్క్ చేశారు. అయితే, బైక్‌లో విలువైన పత్రాలు ఉన్నాయని, వాటిని తీసుకుంటానని పోలీసులకు చెప్పి బైక్ వద్దకు వెళ్లిన రాకేశ్ పెట్రోలు పైపును లీక్ చేసి నిప్పు పెట్టాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మంటలు అదుపు చేసి రాకేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Traffic Rules  Rakesh  Drunk and Drive  traffic cops  Sarvodaya Enclave  Malviya nagar  Delhi  Crime news  

Other Articles