Netizens Trolls on Ongole Gang Rape Case ఒంగోలులో దారుణం.. రేప్ చేసినోడిని చంపేయాలని చెప్పి తానే రేప్ చేశాడు

Netizens trolls on ongole gang rape case

Ongole News, Gang Rape Case, Ongole Gang Rape Case

Netizens Trolls on Ongole Gang Rape Case

ఒంగోలులో దారుణం.. రేప్ చేసినోడిని చంపేయాలని చెప్పి తానే రేప్ చేశాడు

Posted: 06/24/2019 05:43 PM IST
Netizens trolls on ongole gang rape case

ఒంగోలులో 16ఏళ్ల బాలికను ఐదు రోజుల పాటు నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితుడైన వికలాంగ యువకుడు బాజీపై నెటిజన్లు మండిపడుతున్నారు. గతవారం తెలంగాణలోని హన్మకొండలో 9నెలల చిన్నారిపై హత్యాచారం ఘటనను నిరసిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టిన బాజీ.. తానే అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడు. 16 ఏళ్ల బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారం జరిపారు. ఐదురోజులపాటు బాలికను నిర్భందించి అమానవీయంగా అత్యాచారం చేశారు. ఎలాగోలా వారినుంచి బయటపడ్డ బాలిక ఒంగోలు ఔట్ పోస్ట్ పోలీసుల దగ్గరకి చేరుకుని విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాలిక ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆరుగురు  నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలిని వైద్య సేవల నిమిత్తం ఒంగోలు రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. నిందితులపై అవసరం అయితే షీట్స్ కూడా ఓపెన్ చేస్తామని ఎస్పీ సిద్దార్ద్ కౌసల్ తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై ఏపీ హోంమంత్రి ఎస్సీతో మాట్లాడారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. బాలికపై దారుణానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ongole News  Gang Rape Case  Ongole Gang Rape Case  

Other Articles