సరిగ్గా ఎన్నికల వేళ టీడీపీ అభ్యర్థులకు కష్టాలు వచ్చి పడుతున్నాయి. కడప జిల్లా మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ప్రచారం చేసుకుంటున్న క్రమంలో ఆయన ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారన్న వార్త వెలుగులోకి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ అభ్యర్థి.. సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
గన్నవరంలో వల్లభనేని వంశీ మరోసారి తన అభ్యర్థిత్వాన్ని బలపర్చాలని ఎన్నికల బరిలో నిలిచి ప్రచారం చేసుకుంటున్న క్రమంలో ఆయనపై ముగిసిపోయిన కేసులో మళ్లీ కొత్తగా నాన్ బెయిలెబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. 2009లో వంశీపై ఆయుధాల చట్టం కింద నమోదైన కేసుకు సంబంధించి హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో 2013లో విచారణ జరిగిన తరువాత ఆయనపై న్యాయస్థానం కేసును కొట్టివేసింది.
తనకు ప్రభుత్వ రక్షణ వద్దంటూ ప్రైవేట్ భద్రతను వంశీ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో వంశీ వద్ద అక్రమ ఆయుధాలు లభించాయని ఆయనపై అప్పట్లో కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విచారణకు వంశీ నాంపల్లి కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ ను కోర్టు జారీ చేసింది. ఈ విషయమై వంశీ మాట్లాడుతూ, ఈ కేసును 2013లోనే హైకోర్టు కొట్టి వేసిందని, ఇప్పుడు తనను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి నాడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిని నాంపల్లి కోర్టుకు నివేదిస్తానని ఆయన చెప్పారు. కాగా, తనను తెలంగాణ ప్రభుత్వం టీడీపీ నుంచి వైసీపీలోకి చేరాలని బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పూనుకుందని ఆయన వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more