power bill war between telugu states gencos తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ బాకీల పంచాయితీ..

Controversy between ap telangana states genco companies

power war between telugu states, electricity bill payments war between telugu states, telugu states, genco, Transco, Payments, electricity bill Due, controversy, Andhra Pradesh, Telangana, politics

Since the formation of telangana and andhra pradesh states there is a power war between the two states, which was calm in the past had been once again errupted during the andhra pradesh elections time

తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ బాకీల పంచాయితీ..

Posted: 03/09/2019 12:14 PM IST
Controversy between ap telangana states genco companies

రాష్ట్రా పునర్విభజన నాటి నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతునే ఉన్నాయి. పలు సంస్థలకు సంబంధించిన ఇచ్చి..పుచ్చుకునే సందర్భాల విషయంలో కూడా ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పడటంలేదు. ఈ క్రమంలో తెలంగాణ విద్యుత్‌ సంస్థల అధికారుల మధ్య ఆరోపణలు.. ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. విద్యుత్ బిల్లుల బకాయిల విషయంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య పంచాయితీ కొనసాగుతూనే వుంది. ఈ క్రమంలో తమకు రూ. 5,600 కోట్లు ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందనీ తెలంగాణ జెన్ కో అరోపిస్తుంది.

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తెలంగాణకు బాకీ ఉందనీ.. మాకు రావాల్సింది మాకు ఇచ్చి.. వారికి వెళ్లాల్సింది ఉంటే తీసుకోమని ఎన్నిసార్లు చెప్పినా ఏపీ ప్రభుత్వం కానీ, జెన్ కో అధికారుల నుంచి స్పందన కరువైందని తెలంగాణ ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ఆరోపించారు. కాగా ఈ అరోపణలను ఆంధ్రప్రదేశ్ జెన్ కో తీవ్రంగా ఖండించింది. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్ కో సీఎండీలు చెప్పిన అంశాలు వాస్తవ విరుద్ధమని ఏపీ జెన్‌కో ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

తెలంగాణ విద్యుత్తు వినియోగించుకున్న పుస్తకాల్లోని గణాంకాల ఆధారంగా లెక్కించినా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ జెన్ కోకు ఇంకా రూ.11,728 కోట్లు రావాల్సి ఉందనే విషయం అర్థమవుతుందని తెలిపింది. తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థల ఖాతా పుస్తకాల్లో స్పష్టంగా రూ.8,274.23 కోట్లు ఏపీ జెన్‌కోకు చెల్లించాల్సి ఉందన్న విషయం పేర్కొన్నారని.. మిగిలిన మొత్తం తెలంగాణ ఉత్తరప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థల నుంచి రావాల్సిన బకాయిగా ఏపీ జెన్‌కో వివరించింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణ డిస్కంలకు విద్యుత్తు సరఫరా చేశామని కూడా తెలిపింది.

అయితే అందుకు రూ.5,732.40 కోట్లు రావాల్సి ఉందని ఏపీ జెన్ కో స్పష్టం చేసింది. ఈ బకాయిలు రాబట్టుకోవడానికి ఎప్పటికప్పుడు జెన్‌కో ప్రయత్నిస్తోందని..రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చిందని తెలిపారు. ప్రతి నెలా విద్యుత్తు బిల్లులతో పాటు రూ.150 కోట్ల చొప్పున తీర్చేస్తామని తెలంగాణ అంగీకరించిందనీ..అయినా అవి ఇంతవరకు ఆ మాట నెరవేర్చలేదని ఏపీ జెన్‌కో స్పష్టం చేసింది. ఇక నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ ముందు తెలంగాణ విద్యుత్తు సంస్థలపై ఇన్ సాల్వెన్సీ చట్టం కింద పిటిషన్‌ దాఖలు చేయడం తప్ప ఏపీ జెన్ కోకు మరో మార్గం లేదని ఏపీ జెన్ కో స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telugu states  genco  Transco  Payments  electricity bill Due  controversy  Andhra Pradesh  Telangana  politics  

Other Articles