కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం దేశానికి సంబంధించిన ప్రాధాన్యతా అంశాలను పక్కనబెట్టి.. రానున్న సార్వత్రిక ఎన్నికలనే టార్గెట్ గా చేసుకుని వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ తీవ్రంగా తప్పబట్టింది. పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన దాడులు జరిపి వచ్చిన క్రమంలో మరుసటి రోజు ఉదయాన్నే ఆయన రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి.. యావత్ దేశం నివ్వెరపోయేలా అక్కడ ఉగ్రదాడులను అంశాన్ని కూడా ఎన్నికల ప్రచారాస్త్రాంగా మార్చుకున్నారని కాంగ్రెస్ మండిపడింది.
ఇక మరుసటి రోజున దేశ గగనతలంలోకి వచ్చిన పాకిస్థాన్ ఎఫ్-16 యుద్దవిమానాలను వెంబడించి మరీ కూల్చివేసిన తరుణంలో యావత్ దేశమంతా ఏం జరుగుతుందో అని ఎదురు చూస్తున్న క్రమంలో ప్రధాని మాత్రం తాపీగా విద్యార్థులతో సమావేశం నిర్వహించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీఫ్ సూర్జీవాలా విమర్శించారు. ఈ క్రమంలో పాక్ చేతిలో చిక్కిన పైలెట్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని యావత్ భారతదేశం ప్రార్థనలు చేస్తుంటే, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ‘‘మేరా బూత్ సబ్ సే మజ్ బూత్’’ అంటూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రికార్డు సృష్టించాలని చూస్తున్నారని సూర్జేవాలా ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాధాన్య అంశాలను పక్కనబెట్టి, రాబోయే ఎన్నికలపైనే దృష్టి పెట్టారంటూ రణ్‌దీప్ ఫైర్ అయ్యారు. ‘ప్రాధాన్య అంశాలను పక్కనపెట్టేశారు. వింగ్ కమాండర్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని 132 కోట్ల మంది భారతీయులు ప్రార్థిస్తుంటే.. మోదీ మాత్రం రాబోయే ఎన్నికలపైనే దృష్టి పెట్టారు. కాంగ్రెస్ పార్టీ చాలా ముఖ్యమైన సీడబ్ల్యుసీ, ర్యాలీలను రద్దు చేసుకుంది. ప్రధాన మంత్రి మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రికార్డు కోసం ప్రయత్నించడం దురదృష్టకరం’ అంటూ ట్వీట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more