Ready to step down: Karnataka CM Kumaraswamy కాంగ్రెస్ లో కలవరం రేపుతున్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు..

Husband keeping me out says kanaka durga who entered sabarimala

HD Kumaraswamy, Karnataka, JD(S), Congress, JD(S)-Congress alliance, Siddaramaiah, congress karnataka, BJP Karnataka, politics

Karnataka CM HD Kumaraswamy warns congress saying If they want to continue with the same thing, I am ready to step down. They are crossing the line, responding to question on Congress MLAs saying that their CM is Siddaramaiah.

కాంగ్రెస్ లో కలవరం రేపుతున్న సీఎం కుమారస్వామి వ్యాఖ్యలు..

Posted: 01/28/2019 12:52 PM IST
Husband keeping me out says kanaka durga who entered sabarimala

కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామి తాజాగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలవరాన్ని రేకెతిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలపై చేస్తున్న వ్యాఖ్యలతో అసహనానికి గురైన ఆయన వారిపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు హద్దులు దాటి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చేటుచేసుకుంటున్న పరిణామాలు, ఆ పార్టీ ఎమ్మెల్యేల తీరును ఇప్పటికైనా పార్టీ సీనియర్ నేతలు కట్టడి చేయాలని ఆయన అన్నారు.

సీనియర్ నేతలు చోరవ చేసుకుని పార్టీతో పాటు సంకీర్ణ ప్రభుత్వం సజావుగా నడిచేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. పార్టీలో పరిస్థితిని చక్కదిద్దాలని సూచించిన ఆయన ఇకపై కూడా ఇలాంటి పరిస్థితే కొనసాగుతుందని వారు భావించినా.. అలాంటి పరిణామాలే పునరావృతం చస్తామని వారు చెప్పినా తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునేందుకు తాను సిద్దంగా వున్నానని హెచ్చరించారు.

బెంగళూరులో ఈరోజు మీడియాతో మాట్లాడిన కుమారస్వామి.. కాంగ్రెస్ నేతలు వీధుల్లోకి ఎక్కి కొట్టుకుంటే వారికే నష్టమనీ, తనకు ఎలాంటి ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు. ఇటీవల బెంగళూరు శివార్లలోని ఈగల్ టన్ రిసార్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేశ్, తోటి ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. అలాగే పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరేందుకు రహస్యంగా చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పక్ష నేత సిద్దరామయ్య మీడియాపై రుసరుసలాడారు. మీడియా అత్యుత్సాహమే సంకీర్ణ ప్రభుత్వంలో అనార్థాలకు కారణంగా మారువుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మీరే వెళ్లి ఓ వ్యక్తితో తన అభిప్రాయాన్ని సేకరించి.. దాని రెండో వ్యక్తి వద్ద ప్రస్తావించి.. మూడో వ్యక్తి అభిప్రాయాన్ని సేకరించి.. నాలుగో వ్యక్తిని దానిపై స్పందించాలని కోరడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, అంతేకాని.. వాస్తవానికి సమస్యే లేదని ఆయన తెలిపారు. తాను ముఖ్యమంత్రి కుమారస్వామితో మాట్లాడతానని చెప్పారు.

దీనిపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి కూడా స్పందిస్తూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నదాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. ఆయన క్రితం ఐదేళ్లు కాలంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా ప్రజలకు అత్యుత్తమంగా సేవలందించారని అన్నారు. ప్రస్తుతం ఆయన తమ శాసనసభా పక్ష నేతగా వ్యవహరిస్తున్నారని, ఆయన తమ నేత అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పేర్కోనడంలో తప్పేముందని ప్రశ్నించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కుమారస్వామి పాలనలోనూ ప్రజలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా వున్నారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles