central investigation team searches srinivasa rao house దాడిపై జగన్ వాంగ్మూలం.. నిందితుడి ఇంట్లో కేంద్ర దర్యాప్తు బృందాలు

Ap police takes ys jagan statement on vizag airport attack

YS Jagan, YS Jagan attacked, central investigative agencies, AP police, city neuro hospital, YS Jagan vizag airport attack, YS Jagan Mohan Reddy, YS Jagan, YS Jagan srinivas rao, YS Jagan vishakapatnam airport attack, YSRCP, Vishakapatnam airport, YS Jagan injured, andhra pradesh, politics

Srinivas Rao the accused in YS Jagan attempt murder case, house is searched by central investigative agencies, meanwhile AP police reached hyderabad to record Opposition leaders statement.

దాడిపై జగన్ వాంగ్మూలం.. నిందితుడి ఇంట్లో కేంద్ర దర్యాప్తు బృందాలు

Posted: 10/26/2018 11:25 AM IST
Ap police takes ys jagan statement on vizag airport attack

విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ పై జరిగిన దాడి నేపథ్యంలో ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకునేందుకు ఏపీ పోలీసులు ఇవాళ హైదరాబాద్ కు చేరుకున్నారు. వైఎస్ జగన్ చికిత్స పోందుతున్న సిటీ న్యూరో హాస్పిటల్ కు చేరుకున్న పోలీసులు మరికొద్దిసేపట్లో ఆయన స్టేట్ మెంట్ ను రికార్డు చేయనున్నారు. నిన్న ఘటన జరుగగానే విమానాశ్రయంలో ప్రాథమిక చికిత్స చేయించుకున్న అనంతరం ఆయన.. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కు చేరుకున్న విషయం తెలిసిందే.

దీంతో నిందితుడు శ్రీనివాస రావును అదుపులోకి తీసుకన్న సీఐఎస్ఎస్ అధికారులు.. ఆయనను ఏపీ పోలీసులకు అప్పగించారు. అయితే దాడిపై జగన్ తన పిర్యాదును ఇవ్వని నేపథ్యంలో అంధ్రప్రదేశ్ పోలీసులు ఇవాళ హైదరాబాద్ కు వచ్చి జగన్ వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు. జగన్ పై జరిగిన దాడి విచారణకు ఏర్పాటు చేసిన సిట్ అధికారుల బృందంలోని అడిషనల్ డీసీపీ మహేంద్ర పాత్రుడు నేతృత్వంలో డీఎస్పీ నాగేశ్వరరావు, మరో ఇద్దరు ఇనస్పెక్టర్ల బృందం వచ్చింది. హత్యాయత్నానికి సంబంధించి, జగన్ చెప్పే వివరాలను వీరు రికార్డు చేయనున్నారు.

ఇక విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్ లో కూర్చున్న జగన్ వద్దకు వెళ్లి.. తాను అభిమానినంటూ సెల్పీ దిగిన ఎయిర్ పోర్టు క్యాంటీన్ ఉద్యోగి శ్రీనివాసరావు దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దినేష్ కుమార్ ఇచ్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎయిర్ పోర్టు పోలీసు స్టేషన్ పోలీసులు.., నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307 (హత్యాయత్నం) ప్రకారం కేసును నమోదు చేసినట్టు పోలీస్ ఇనస్పెక్టర్ మల్లా శేషు వెల్లడించారు. కేసును దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.

ఇదిలావుండగా, తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని ముమ్మిడివరం ప్రాంతంలో నివసించే నిందితుడు శ్రీనివాసరావు ఇంట్లో కేంద్ర దర్యాప్తు బృందాలు అకస్మిక దాడులు జరిపాయి. ఆయన నివాసంలోని అణువణువూ అన్వేషిస్తున్నాయి. దీంతో పాటు శ్రీనివాసరావు తల్లిదండ్రులను, ఆయన సోదరులను కూడా దాడి నేపథ్యంలో విచారిస్తున్నాయి. కాగా శ్రీనివాసరావు జగన్ కు వీరాభిమాని అని వారు వెల్లడించినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysrcp  YS Jagan Mohan Reddy  YS Jagan  central investigative agencies  AP police  crime  

Other Articles