Congress suspects CEC on KCR prospect of elections అప్పుడే ఎన్నికలు: కేసీఆర్.. ఆయనకెలా తెలుసు: ఉత్తమ్

Uttam kumar reddy suspects cec on kcr prospect of elections

K. Chandrasekhara Rao, TRS, KCR, uttam kumar reddy, central election commission, congress, assembly elections, kranti kiran, babu mohan, ktr, harish rao, sititing mla, balka suman, patnam mahender reddy, patnam narender reddy, Telangana cabinet meet, Telangana, Politics

Telangana PCC Chief Uttam Kumar Reddy suspects Central Election Commission on CM K. Chandrasekhar Rao deliberately declares that election will be holding in November.

అప్పుడే ఎన్నికలు: కేసీఆర్.. ఆయనకెలా తెలుసు: ఉత్తమ్

Posted: 09/06/2018 06:05 PM IST
Uttam kumar reddy suspects cec on kcr prospect of elections

తెలంగాణ శాసనసభకు నవంబర్ లో ఎన్నికలు జరుగుతాయని, డిసెంబర్ లో ఫలితాలు వెలువడతాయని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణకు కూడా ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు.

తెలంగాణ అసెంబ్లీని తొమ్మిది నెలల ముందు రద్దు చేస్తూ తన ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల్లో ఏర్పడకుండా వ్యూహాత్మకంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో ఆయన తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్న తరువాత తొలిసారిగా తెలంగాణ భవన్ నుంచి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ 100కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ 100 స్థానాల్లో 50 శాతానికిపైగా ఓట్లను సాధిస్తామని, వీటిలో 82 నియోజకవర్గాల్లో అయితే 60 శాతానికి పైగా ఓట్లు వస్తాయని ఘంటా పథంగా చెప్పారు.

అయితే కేసీఆర్ నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని, డిసెంబర్ లో ఫలితాలు వెలువడుతాయని చెప్పిన నేపథ్యంలో దీనిపై అనుమానాలను వ్యక్తం చేశారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ విషయంలో తాను కేంద్ర ఎన్నికల కమీషన్ తో మాట్లాడానని కూడా చెప్పారని ఈ విషయంలో అనేక సందేహాలకు తావిస్తుందని ఉత్తమ్ అనుమానాలను వ్యక్తం చేశారు. అసెంబ్లీని రద్దు చేయకముందు కేంద్ర ఎన్నికల సంఘం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో ఎన్నికల ఎప్పుడు నిర్వహించే విషయమై ఎలా వెల్లడిస్తుండని ఉత్తమ్ ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles