good news from IMD, Heavy rain, storm to hit telugu states తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. అప్రమత్తతా అవసరం

Good news from imd heavy rain storm to hit telugu states

Thunderstorm, South India, Andhra Pradesh, Telangana, indian metrological department, cloud erosion, weather

The Indian Metereological Department (IMD) issued a fresh warning and forecasted that thunderstorm accompanied with gusty winds and lightning is very likely at isolated places over Coastal Andhra Pradesh, Telangana and Rayalaseema

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. అప్రమత్తతా అవసరం

Posted: 06/02/2018 07:45 PM IST
Good news from imd heavy rain storm to hit telugu states

వేసవిలో భానుడి భగభగలను, ఉక్కపోతలను అనుభవించి.. ఇవేం ఉష్ణోగ్రతలురా దేవుడా.. ఎప్పుడు ఉపషసమం లభిస్తుందని వేచిచూస్తున్న తెలుగు రాష్ట్రవాసులకు వాతావరణ శాఖ శభవార్తను అందించింది. ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించినట్లేనని, నైరుతి రుతుపవనాలు కేరళను దాటి తమిళనాడు, రాయలసీమ మీదుగా తెలంగాణ వైపు విస్తరిస్తున్నాయని తెలిపింది.

మరోపక్క, హైదరాబాద్ లో ఈ ఉదయం నుంచి ప్రజలు చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా  పలు చోట్ల విద్యుత్తు స్తంభాలు నేలకొరిగినట్టు తెలుస్తోంది. సత్తుపల్లి, వరంగల్ ప్రాంతాల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు స్వల్ప అంతరాయాలు కలిగాయి.

అటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కురుస్తుంది. శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, విజయ నగరం జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. శ్రీకాకుళంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఆ జిల్లాలోని హిరమండలం భగీరథ పురంలో పిడుగుపడడంతో రాజు అనే 38 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

నెల్లూరు జిల్లాలో వర్షం కురుస్తోన్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ప్రకాశం జిల్లా చీరాలలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. విశాఖపట్నంలోని పాడేరు, రావి కమతం, బచ్చయ్యపేటల్లో ఓ మోస్తరు వర్షం పడుతోంది. కడప, చిత్తూరు జిల్లాల్లోనూ రానున్న 3 గంటల్లో వర్షం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విజయనగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Thunderstorm  South India  Andhra Pradesh  Telangana  

Other Articles