aiadmk cadre eat food during hunger stirke.. అన్నాడీఎంకే నిరాహారదీక్ష అంతా ఫార్సే.. ఫోటోలతో బట్టభయలు..

Aiadmk hunger strike with lunch break cadre eat biryani or tomato rice

AIADMK, Cauvery, DMK, Hunger strike, Tamil Nadu, Water dispute, supreme court

The AIADMK's 'hunger' strike was for setting up the Cauvery Management Board but pictures showed them taking a lunch break.

అన్నాడీఎంకే నిరాహారదీక్ష అంతా ఫార్సే.. ఫోటోలతో బట్టభయలు..

Posted: 04/04/2018 02:44 PM IST
Aiadmk hunger strike with lunch break cadre eat biryani or tomato rice

కావేరి నదీజలాల విషయంలో ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడంతో పాటు ఆరువారాల్లోగా కావేరీ నదీ జలాలాపై మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలన్న అదేశాలను కూడా జారీ చేసింది. అయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ విషయంలో అవలంభిస్తున్న తాత్సార వైఖరినికి నిరసనగా తమిళనాడులోని అధికార పార్టీ అన్నాడీఎంకే పార్లమెంటులో నిరసనలు కార్యక్రమానికి దిగారు. ఇక బడ్జెట్ మలివిడత సమావేశాలు చివరి వారానికి చేరుకున్న క్రమంలో అన్నాడీఎంకే కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు నిరాహారదీక్షలో కూడా పాల్గొంది. సీఎం పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం లు స్వయంగా పాల్గొన్న ఈ దీక్ష ఎలా జరిగిందంటే..

ఇలా నిరాహార దీక్ష చేస్తే వందేళ్లు కూడా చేసేయ్యవచ్చు.. అన్నేట్లుగా సాగింది. అదెలా అంటే.. బయట మాత్రం నిరాహార దీక్ష చేస్తున్నామని ప్రచారం చేస్తూనే అన్నాడీఎంకే నేతలు మధ్యాహ్నం అయ్యేసరికి కడుపారా అరగించారు. అయితే బిర్యానీ అరగించారా..? లేక టమాటా రైస్ అరగించారా..? అన్న ప్రశ్న కూడా ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది. ఏకంగా పదిరోజులుగా దేశ పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటూ.. సభాకార్యక్రమాలలో గంధరగోళం సృష్టించిన ఎంపీలు చిత్తశుద్దిపై వీరి నిరాహార దీక్ష ప్రశ్నల వర్షాలు కురిపించేలా చేస్తుంది. అన్నాడీఎంకే పార్టీ నేతల మాటల వెనుక వున్న చిత్తశుద్దికి అద్దం పడుతుంది.

కేంద్ర ప్రభుత్వంపై పలు పార్టీలు వరుసగా ఇస్తున్న అవిశ్వాస నోటీసులు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తెలుగు ఎంపీలు ఇచ్చిన అవిశ్వాసం నోటీసులు చర్చకు రాకుండా మోదీ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలుస్తున్నారన్న విమర్శలు ఇప్పటికే ఆ పార్టీ నేతలను చుట్టుముట్టాయి. అయితే తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నట్టు ఆ పార్టీ ఎంపీలు చేస్తున్నదంతా డ్రామానే అనే విషయం వెలుగు చూసింది. తమిళ రాష్ట్ర ప్రయోజనాల కోసం కావేరీ బోర్డును ఏర్పాటు చేయాల్సిందే అనే డిమాండ్ తో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే నిరాహార దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు సైతం ఈ దీక్షలో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు చేపట్టిన నిరాహారదీక్షకు సంబంధించి కొన్ని ఫొటోలు బయటకు రావడం ఇప్పడు సంచలనంగా మారింది. నిరాహార దీక్ష మధ్యలో పక్కకు వచ్చి, కడుపునిండా భోజనాలు లాగిస్తున్న నేతల ఫొటోలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు పలువురు వ్యక్తులు మందు తాగడం కూడా వెలుగు చూసింది. దీంతో, అన్నాడీఎంకే చేస్తున్న పోరాటంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఢిల్లీలో అన్నాడీఎంకే నేతలు చేస్తున్నదంతా పొలిటికల్ డ్రామానే అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIADMK  Cauvery  DMK  Hunger strike  Tamil Nadu  Water dispute  supreme court  

Other Articles