Chandrababu meets Kejriwal in delhi హస్తినాన 2రోజు చంద్రబాబు బిజీ.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ..

Chandrababu naidu meets arvind kejriwal in show of opposition strength

chandrababu naidu in delhi, chandrababu naidu arvind kejriwal meeting, andhra pradesh special category status, federal front, chandrababu naidu third front, tdp no confidence motion, chandrababu naidu opposition meeting, chandrababu naidu national media, politics

Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu on Wednesday met his Delhi counterpart Arvind Kejriwal, amid his attempts to garner support for the no-confidence motion moved by his party TDP against the Centre.

హస్తినాన 2రోజు చంద్రబాబు బిజీ.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ..

Posted: 04/04/2018 11:47 AM IST
Chandrababu naidu meets arvind kejriwal in show of opposition strength

దేశరాజధాని ఢిల్లీ పర్యటనలో రెండోరోజు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీగానే గడుపుతున్నారు. ఉదయాన్నే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయిన ఆయన.. కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగానే అక్షేపించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను నెరవేరుస్తామని చెప్పిన కేంద్రంలోని మోడీ సర్కార్ ఎలా నయవంచన చేసిందన్న విషయాన్ని ఆయన అరవింద్ కేజ్రీవాల్ తో పంచుకున్నారు. ఈ క్రమంలో అప్ ఎంపీలు కూడా టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణానికి మద్దుతుగా నిలుస్తారని అరవింద్ కేజ్రీవాల్ మద్దతు పలికారని సమాచారం.

ఆ తరువాత జాతీయ మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలగించాలని దేశ్యాప్తంగా ఎన్డీయే పార్టీల నుంచి వచ్చిన డిమాండ్ కు తాను మద్దతు పలికానని చంద్రబాబు తెలిపారు. కాగా  అందరికన్నా ముందు మీరే కదా డిమాండ్ చేశారు అనే మీడియా ప్రశ్నకు బదులుగా... అవునని చెప్పారు. దేశంలో బిన్నత్వంలో ఏకత్వం సాధించాలని కానీ విధ్వంసం, విషాదాలు కాదన్న ధోరణిలో అప్పట్లో అలా డిమాండ్ చేశానని అన్నారు. జరిగిన విషయాలను చరిత్ర రికార్డుల నుంచి ఎవరూ చెరిపివేయలేరని అన్నారు.

రాష్ట్ర అభివృద్ధి కోసమే మోదీతో చేతులు కలిపానని... కానీ, ఆయన ఇలా నమ్మక ద్రోహం చేస్తారని తాను అనుకోలేదని చెప్పారు. అప్పట్లో మీరు అన్న మాటలను మోదీ గుర్తుంచుకున్నారేమో అనే ప్రశ్నకు బదులుగా... గుర్తుంచుకొని ఉండవచ్చేమో అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. తనకు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు చెప్పారు. ఏపీకి కేంద్రం సాయం చేస్తే, అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలను అధిగమిస్తుందనే భావనతో మోదీ మీకు సహాయం చేయడం లేదా అనే ప్రశ్నకు బదులుగా... ఆ విషయాన్ని మీరే గ్రహించాలని చంద్రబాబు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ పట్ల గవర్నర్ నరసింహన్ కూడా సానుకూలంగా స్పందించడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి.. మీరేమంటారు అన్న ప్రశ్నకు బదులుగా ఆయన 'ఔను' అన్నట్టు తల ఊపారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు వివరించేందుకే తాను ఢిల్లీకి వచ్చానని చెప్పారు. ప్రస్తుతం తనకు రాజకీయాలు ముఖ్యం కాదని... ఏపీకి న్యాయం చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడమే ముఖ్యమని అన్నారు. ఇక ఈ క్రమంలో చంద్రబాబు వివిధ పార్టీల నేతలతో రాష్ట్ర ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చిస్తున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, టీఆర్ఎస్, కాంగ్రెస్, అప్నా దళ్, శిరోమణి అకాలీదళ్, టీఎంసీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఇక ఇవాళ కూడా జాతీయ నేతలతో వరుసగా భేటీ అవుతూ బిజీగా గడుపనున్నారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles