‘Rs 15 Lakh credited to your account’: congress spoof video on bjp ‘ఫూల్స్ డే’ సద్వినియోగం చేసుకున్న కాంగ్రెస్: కేంద్ర వైఫల్యాల వీడియో

Congress targets modi government in spoof video on april fool s day

Happy jumla divas, congress video april fool divas, happy jumla divas congress, april fool politics, narendra modi april fool video, rahul gandhi april fool video

"Rupees 15 Lakh has been credited to your AC, India has created so many jobs that aliens from Mars are working here, Nirav Modi and Mehul Choksi have swept Punjab National Bank in support of PM Narendra Modi's Swachch Bharat" - these were some jibes taken by Congress at the BJP on April fools day.

ITEMVIDEOS: ‘ఫూల్స్ డే’ సద్వినియోగం చేసుకున్న కాంగ్రెస్: కేంద్ర వైఫల్యాల వీడియో

Posted: 04/02/2018 02:31 PM IST
Congress targets modi government in spoof video on april fool s day

కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని అధికార ఎన్డీయే ప్రభుత్వంపై ఇప్పటికే దేశ ప్రజల నుంచి పలు విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అటు పార్టీలు కూడా కేంద్రంపై యుద్దభేరీలను పూరించాయి. ఓ వైపు పార్లమెంటులో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణాలను ప్రవేశపెట్టి సభలో చర్చ జరగాలంటూ నినాదాలు చేస్తుండగానే ఇటు అందివచ్చిన అన్ని అవకాశాలను సజావుగా వాడుకుంటూ ప్రధాన విపక్షం కాంగ్రెస్ మరింతగా దూసుకెళ్తుంది. ఇందులో భాంగా ఏప్రీల్ 1న జరిగే 'ఫూల్స్‌ డే'ను కూడా కాంగ్రెస్‌ పార్టీ వినూత్నంగా వాడుకుంది.

ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ప్రజలకు మరోమారు గుర్తు చేస్తూ.. వాటిని అమల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందం కొనసాగుతున్నా.. వాటిని ఘనంగా అమలుచేస్తున్నామంటూ ప్రచారం మాత్రం దేశవ్యాప్తంగా టీవీలలో అదరగొట్టడాన్ని పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్.. దానినే అస్త్రంగా తీసుకుని సర్కారు వైఫల్యాలపై బ్రేకింగ్ న్యూస్ అంటూ ఒక వీడియోను రూపొందించి, దీనిని సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియోను దేశ ప్రజల వీక్షణతో సంచలనంగా మారింది.

ఈ వీడియోలో ప్రధాని మోదీ తీసుకున్న డీమానిటైజేషన్ వల్ల అవినీతి అంతమైపోయిందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. స్వచ్ఛభారత్ కు పీఎన్బీ నిందితులు పెద్దఎత్తున మద్దతిస్తున్నారని తెలిపింది. చెత్తాచెదారంతో నిండిన గంగా నదిలో మోదీ చిత్రపటం కూడా స్వచ్ఛంగా కనిపిస్తోందని ఎద్దేవా చేసింది. మోదీ సర్కార్ 200 కోట్ల ఉద్యోగాలు కల్పించిందని, ఇప్పుడు అంగారక గ్రహం నుంచి గ్రహాంతరవాసులు వచ్చి భారత్‌ లో ఉద్యోగాలు చేస్తున్నారని వ్యంగ్యంగా పేర్కొంది. దేశంలోని స్మార్ట్‌ సిటీల్లో చెత్తను రోబోలు సేకరిస్తున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోలో ఎద్దేవా చేసింది.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Happy jumla divas  congress video april fool divas  congress  bjp  PM modi  politics  

Other Articles