Ambani Special Aircraft for Sridevi Dead body | శ్రీదేవి భౌతికకాయం కోసం అంబానీ స్పెషల్ ఫ్లైట్

Special fight for sridevi deadbody

Sridevi, Sridevi Dead body, Sridevi Death, Sridevi Ambani, Ambani Flight, Anil Ambani, Special Flight, Ambani Special Flight Sridevi

Sridevi’s body to be brought back in Anil Ambani’s aircraft. Indian industrial magnate Anil Ambani has sent an aircraft to Dubai to bring back Bollywood actress Sridevi Kapoor’s body to India later on Sunday, sources said. Sridevi, 54, passed away in Dubai late on Saturday night, plunging the entire country into a pall of gloom as her fans and admirers expressed shock and disbelief.

శ్రీదేవి కోసం స్పెషల్ జెట్ విమానం

Posted: 02/26/2018 09:39 AM IST
Special fight for sridevi deadbody

దివంగత సినీతార శ్రీదేవీ పార్థివదేహం మరికొద్ది సేపట్లోనే ముంబైకి రానుంది. ఇండియన్ మిలీనియర్స్ అంబానీ కుటుంబానికి చెందిన ప్రత్యేక జెట్‌ విమానంలో ఆమె భౌతిక కాయాన్ని దుబాయ్ నుంచి తీసుకురానున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత రాత్రి శ్రీదేవీకి పోస్ట్‌మార్టం ప్రారంభమైన సమయంలోనే ఈ విమానం బయలుదేరి వెళ్లింది.

రిలయన్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ ట్రావెల్‌ లిమిటెడ్‌కు చెందిన (ఎంబ్రార్‌-135బీజే) విమానం తన సేవలను అందించనుంది. ఈ సంస్థ ప్రస్తుతం అనిల్‌ అంబానీ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇక బోనికపూర్‌ మేనల్లుడు మొహిత్‌ మార్వా పెళ్లి కోసం రస్‌ ఆల్‌ ఖైమాకు వెళ్లిన శ్రీదేవి శనివారం రాత్రి తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లోని రషీద్‌ ఆసుపత్రిలో ఇప్పటికే శ్రీదేవి పోస్టుమార్టం పూర్తయింది. అయితే, దౌత్య వ్యవహారాల కారణంగా భౌతికాయం తరలింపు ఆలస్యమవుతోంది.

శ్రీదేవి పార్థివదేహాన్ని మొదట అంధేరీలోని ఆమె ఇంటికి తరలిస్తారు. అటు నుంచి మెహబూబా స్టూటియోకు తీసుకెళతారు. అనంతరం జుహూలోని శాంతా క్రజ్‌ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles