కార్పొరేట్ ఆసుపత్రుల అగడాలు రోజుకోక్కటి వెలుగులోకి వస్తున్నా.. వారిలో మాత్రం కనీసం మార్పు రావడం లేదు. ప్రజాధనంతో వైద్యవిద్యను అభ్యసించామన్న కనీస కృతజ్ఞత కూడా లేకుండా అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. వైద్యులను నారాయణలుగా పొల్చుతూ.. దేవుళ్లుగా పరిగణిస్తూ.. రోగులు, వారి బంధువులు వ్యవహరిస్తుంటే.. వారు మాత్రం తాము నారాయణులమని, తమకంతా ధనంతోనే కానీ మనుషులతో పనిలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఓ గర్భిణి పట్లు కార్పోరేట్ అసుపత్రి వ్వవహరించిన ఘటన బట్టబయలైంది. జ్వరంతో ఆసుపత్రిలో చేరిన ఓ గర్భవతికి 22 రోజుల పాటు చికిత్స చేసినందుకు గాను ఏకంగా రూ.18లక్షల బిల్లు వేసి తమ ధనదాహాన్ని తీర్చుకుంది ఓ కార్పోరేట్ అసుపత్రి. హర్యాణాలోని ఫరీదాబాద్ ఏషియన్ అసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో రోగి బంధువులు ఆందోళన చేపట్టారు.
వివరాల్లోకెళ్తే.. హర్యాణలోని ఫరిదాబాద్ లోని ఏషియన్ ఆసుపత్రిలో జర్వంతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీ చేర్పింది. ‘టైఫాయిడ్ వచ్చిందని చెప్పి వైద్యులు వెంటనే ఆమెను ఐసీయూలో పెట్టారు. అనంతరం ఆమెకు గర్భస్రావం అయిందని, వెంటనే ఆపరేషన్ చేసి పిండాన్ని బయటకు తీయాలని చెప్పి రూ.3లక్షలు కట్టమన్నారు. 22 రోజుల పాటు ఆమెకు చికిత్స అందించినప్పటికీ.. ప్రాణాలు మాత్రం దక్కలేదు. ఇక చివరకు రూ. 18 లక్షల బిల్లును కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లలాని అసుపత్రి వర్గాలు అదేశించాయి.
దీంతో ఖంగుతిన్న రోగి బంధువులు.. ఆపరేషన్‌కు ముందే రూ.12లక్షల చెల్లించామని, అయినా తమ వారి ప్రాణాలు దక్కలేదని అరోపించిన బంధువులు ఇప్పుడు ఏకంగా మరో అరు లక్షల రూపాయలను చెల్లించి రోగి మృతదేహాన్ని తీసుకెళ్లాలని అస్పత్రి వర్గాలు చెబుతున్నాయని రోగి తరపు బంధువు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్ యాజమాన్యం తీరుపై విచారణ చేపట్టాలని, 22 రోజులకు రూ.18లక్షల బిల్లు ఎలా వేస్తారంటూ ఆమె బంధువులు ఆందోళన చేస్తున్నారు.
Haryana: A pregnant woman, suffering from fever, died at Faridabad's Asian Hospital. Hospital administration handed over bill of Rs 18 Lakh to her family for a 22-days treatment. Relatives demand an investigation against hospital administration. (08.01.2018) pic.twitter.com/hKY1yLgUSj
— ANI (@ANI) January 11, 2018
(And get your daily news straight to your inbox)
Apr 21 | నిర్భయ ఘటన తరువాత దేశవ్యాప్తంగా కలకలం రేపిన అత్యాచారాలు బీజేపి ప్రభుత్వాలు అధికారంలో కొనసాగుతున్న ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావ్, జమ్మూలోని కథువా అత్యాచారాలని చెప్పనక్కర్లేని విషయం. కాగా ఉన్నావ్ లో బీజేపి ఎమ్మెల్యే... Read more
Apr 21 | టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తండ్రి నిడమర్తి బసవరాజుకు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. విశాఖపట్నంలోని వేపగుంట ప్రాంతానికి చెందిన బసవరాజు (53) సింహాచలం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో... Read more
Apr 21 | టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం గుట్టు వెనుకనున్న దుష్టచతుష్టయం వీళ్లేనంటూ క్రితం రోజున వరుస ట్విట్లతో బయటపెట్టిన పనవ్..వీళ్లే తన తల్లిని విమర్శించారని ఆరోపిస్తూ, ఫిల్మ్ చాంబర్ కు వచ్చి దీనిపై గట్టి... Read more
Apr 20 | డీజిల్, పెట్రోల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. శుక్రవారం డీజిల్ ధర ఆల్ టైం గరిష్ఠానికి చేరింది. ఢిల్లీలో ఈరోజు లీటర్ డీజిల్ ధర రూ.65.31గా ఉంది. కోల్‌కతాలో రూ.68.01గా, ముంబయిలో రూ.69.54గా, చెన్నైలో... Read more
Apr 20 | తల్లిని విమర్శిస్తూ.. అసభ్యపదజాలంతో తిట్టించిన దుష్టచతుష్టయం ఫోటోలను ఇవాళ ఉదయం వరుస ట్వీట్ల ద్వారా విడుదల చేసిన జనసేనాని, పవర్ స్టార్ పవన్.. ఫిల్మ్ చాంబర్ లో పెద్దలతో చర్చించి తిరిగి వచ్చిన తరువాత... Read more