Actor-director Neeraj Vora passes away నటుడు, నిర్మాత నిరజ్ వోరా కన్నుమూత

Filmmaker and actor neeraj vora dies at the age of 54

neeraj vora, neeraj vohra, neeraj vora died, neeraj vora death, neeraj vora passes away, neeraj vora dead, phir hera pheri director, bol bachchan, welcome back, neeraj vora news

Bollywood actor, writer and filmmaker Neeraj Vora, who was in coma for almost a year, passed away on Thursday morning. He was 54. Neeraj Vora died today at 3 am in Criti Care hospital in Juhu.

ప్రముఖ నటుడు, నిర్మాత నిరజ్ వోరా కన్నుమూత

Posted: 12/14/2017 10:04 AM IST
Filmmaker and actor neeraj vora dies at the age of 54

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. ప్రముఖ నటుడు, రచయిత, నిర్మాత నీరజ్ వోరా(54) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ వేకువజామున ముంబైలో చనిపోయినట్లు సన్నిహితులు వెల్లడించారు. హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కోమాలోకి జారుకున్న ఆయన గత పద్నాలుగు మాసాలుగా జీనవన్మరాల మధ్య పోరాడుతూ ఇవాన తన ఓటమిని అంగీకరించి ఇవాళ కన్నమూశారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపిన దర్శకుడు అశోక్ పండిట్.., "నా ప్రియ మిత్రుడు నీరజ్ వోరా ఇక లేరు అని చెప్పేందుకు బాధగా ఉంది. జుహూలోని క్రిటికేర్ ఆసుపత్రిలో ఇవాళ ఉదయం నీరజ్ మరణించారు. అతడి అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం 3గంటలకు ముంబైలో జరగనున్నాయని" తెలిపారు. రచయితగా నటుడు ఆమిర్ ఖాన్ మూవీ 'రంగీలా'కు రైటర్ గా పనిచేసి బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నీరజ్ వోరా.. సినిమాలపై ఆసక్తితో  గుజరాత్‌ నుంచి ముంబైకి వచ్చి స్థిరపడ్డారని కూడా తెలిపారు.

ఆపై ఎన్నో సినిమాలకు రచయిగా సేవలు అందించిన అనంతరం 2000లో విడుదలైన కిలాడీ 420 మూవీతో దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తిన 'నీరజ్ వోరా ఫిర్ హెరా ఫెరి'కి కథ అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. 2016 అక్టోబర్‌లో బ్రెయిన్ స్ట్రోక్‌ రావడంతో ఆయన ఆరోగ్యం క్షీణించి కోమాలోకి వెళ్లిపోయారు. నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయితగా ఇలా విభాగాల్లో విశేష సేవలందించిన నీరజ్ వోరా గురువారం వేకువజామున మృతిచెందారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : neeraj vora  actor  writer  director  filmmaker  no more  passes away  bollywood  

Other Articles