New York Port Authority attack: Man held after Manhattan blast మన్ హట్టన్ లో బాంబుదాడికి యత్నించి గాయపడ్డ తీవ్రవాది

Subway bomber wounds self three others in manhattan

New York bomb blast, US New York, blast suspect, suspect bangladesh, New York blast suspect, Akayed Ullah, Bangladesh, Manhattan, NYPD, Port Authority, Islamic State, terrorist attack, bomb blast in newyork, bomb blast in US, bomb blast in America, crime

The suspect in the New York blast, Akayed Ullah is a Bangladeshi who is said to have been inspired by the Islamic State to carry out a terrorist attack

మన్ హట్టన్ లో బాంబుదాడికి యత్నించి గాయపడ్డ తీవ్రవాది

Posted: 12/12/2017 11:04 AM IST
Subway bomber wounds self three others in manhattan

అమెరికాలోనికి ఇస్లామిక్ దేశాలకు చెందిన సాధారణ పౌరులకు కూడా ప్రవేశించకుండా వీసాను నిరాకరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అక్కడి డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే తాజాగా చోటుచేసుకున్న ఘటన మాత్రం ఆయన వాదనను బలపరుస్తుంది. ఇస్తామిక్ దేశాలకు చెందిన వారు తమ దేశంలోకి వచ్చి.. ఇతర మతసంస్థలకు చెందిన ఉగ్రవాదులు గుప్పెట్లో చిక్కకుని దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్నారని అరోపిస్తున్న అగ్రరాజ్య అధికారుల అంచానాలకు తగ్గట్టుగానే ఈ ఘటన చోటుచేసుకుంది.

అగ్రరాజ్యంలోని న్యూయార్క్ రాష్ట్రం మన్ హట్టన్ నగరంలో జరిగిన ఓ ఆత్మహుతి దాడి ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది. ఇక్కడి ఓ బస్ టెర్మినల్ వద్ద సోమవారం సాయంత్రం ఆత్మాహుతి దాడి జరిగింది. అయితే ఈ ఘటనలో ఆత్మహుతికి పాల్పడబోయిన ఓ ఉగ్రవాదితో పాటు మరో ముగ్గురు దేశపౌరులు గాయాల పాలయ్యారు. ఇందుకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడి వెనక ఇస్తామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కుట్రే దాగివుందని అనుమానాలను వ్యక్తం చేసిన న్యూయార్క్ పోలీసుల అంచనాలే నిజమవుతున్నాయి.

మన్ హట్టన్‌ 42వ వీధిలోని ఎనిమిదో అవెన్యూ బస్ టెర్మినల్ వద్ద ఈ దాడి జరిగింది. ఈ బాంబు విస్పోటనం అనంతరం క్షతగాత్రులైన ముగ్గురు పౌరులను అస్పత్రికి తరలించిన పోలీసులు ఆ తరువాత సమీపంలో తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని గుర్తించారు. అతడి దగ్గరికి వెళ్లి చూడగా అనుమానాస్పదంగా కనిపించటంతో పాటు రక్తపు గాయాలు అవుతున్నా పోలీసులను చూసి అదుకోవాలని అడిగే బదులు.. ఇబ్బందిపడుతున్నట్లుగా కనిపించాడు. అనుమానం వచ్చిన పోలీసలు అతడు ధరించిన జాకెట్ ను పరిశీలించగా, దాంట్లో వైర్లు ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడింది అతడేనని పోలీసులు నిర్థారించుకున్నారు.

ఉగ్రవాదిగా అనుమానిస్తున్న అతడిని బంగ్లాదేశ్ కు చెందిన అఖాయెద్ ఉల్లాగా గుర్తించారు. ఐసిస్‌ సానుభూతి పరుడు అయిన అతడు ఏడేళ్లుగా అమెరికాలోనే ఉంటున్నాడు. ఉల్లా తాను పనిచేస్తున్న ఎలక్ట్రిక్ కంపెనీలో బాంబును తయారు చేసినట్టు విచారణలో వెల్లడైంది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సోమవారం ఉదయం జాకెట్ లో బాంబు పెట్టుకుని బస్ టెర్మినల్ వద్దకు చేరుకున్న ఉల్లా బాంబును పేల్చడంలో విఫలమయ్యాడు. దీంతో బాంబు సరిగా పేలలేదు సరికదా, ఉల్లా గాయపడ్డాడు. ఈ ఘటనలో గాయపడిన మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles