నగరీకరణ తెలియని వలస జీవులు నగరంలో స్త్రీ, పురుషుల మధ్య సన్నిహిత్యంతో అబలలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని.. ఈ పరిస్థితిలో మార్పులు తీసుకువచ్చేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, నూతన చట్టాలు, చట్టాల్లో మార్పులు తీసుకొస్తున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా అమ్మాయిలపై వేధింపులు ఆగడం లేదు. అయితే ఈ అంచానాలు కూడా తప్పని రుజువయ్యాయి. సాధారణ వలసజీవులే కాకుండా.. విలసాలకు అలవాటుపడి విమానాల్లో ప్రయాణాలు చేస్తున్న మృగాళ్లు కూడా వున్నారని ఇప్పటికే పలు సందర్భాలలో నిరూపితమైంది.
సంపన్న కుటుంబాల్లో పుట్టి.. స్త్రీ పురుషుల మధ్య సన్నిహిత్యం గురించి తెలిసిన వారు కూడా పోకిరీల మాదిరిగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ జాబితాలో సెలబ్రిటీలను సైతం వున్నారంటే పురుషాధిక్య సమాజంలో అడవాళ్లు బతుకులు ఎంత దారుణంగా మారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. రోడ్లు, బస్సులు, బైకులు, పాదచారులపైనే కాదు...ఆఖరికి విమానాల్లోనూ వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలా వేదింపులకు గురైన సెలబ్రిటీల జాబితాలో దంగల్ నటి జైరా వసీమ్ కు చేరింది. అమె ప్రయాణిస్తున్న విమానంలో ఒక మగమృగం పైశాచికత్వాన్ని ప్రదర్శించింది.
దీనిపై సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసిన అమె తన అవేదనను కూడా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో ప్రకంపనలు సృష్టించడంతో రంగంలోకి దిగిన జాతీయ మహిళా కమీషన్ అమెకు అండగా నిలిచింది. వెంటనే అమె వెనుక కూర్చున్న వ్యక్తి తాలుకు వివరాలను తెలియజేయాల్సిందిగా అదేశించింది. సహచర ప్రయాణికుడు ఆమెను లైంగికంగా వేధించాడు. ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి దిగేవరకూ అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో వేధింపులపై జైరా వసీమ్ కన్నీటి పర్యంతమైంది. ఎలా వేధించాడో వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసింది.
ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేందుకు విస్తారా ఫ్లైట్ ఎక్కిన జైరాను వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణికుడు పదేపదే ఇబ్బంది పెట్టాడు. ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి దిగేవరకూ కాళ్లూచేతులతో జైరాను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. వేధింపులను సోషల్ మీడియా ద్వారా జైరా బయటపెట్టడంతో విస్తారా ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అవేదనతో అమె తన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో తమ ఎయిర్ లైన్స్ లో ఇలాంటి ప్రవర్తనను సహించబోమన్న... విస్తారా.... జైరాకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించింది. అయితే జైరాతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడ్ని... ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more