Hyderabad Metro Journey Confusions | హైదరాబాద్ మెట్రో జర్నీ.. ఫస్ట్ డే షాకులు

Hyderabad metro journey confusions

Hyderabad Metro Train, Metro Train Changes, Nagole to Miyapur Train Route, Hyderabad Metro Smart Card, Paid Area Hyderabad Metro, Hyderabad Metro Fine

Hyderabad Metro Train Journey Shocks People. No Single train between Nagole to Miyapur Route. Smart Card Paid Area Charges Cut.

మెట్రో జర్నీ.. ఫస్ట్ డే షాకులు

Posted: 11/30/2017 09:28 AM IST
Hyderabad metro journey confusions

మెట్రో జర్నీ కోసం హైదరాబాదీలు ఉవ్విళ్లూరుతున్నారు. ఫ్యామిలీలతో సహా ప్రయాణం కోసం ఎగబడిపోతున్నారు. అయితే మెట్రో స్మార్ట్ కార్డు ఉన్న వారు స్టేషన్ లలో కలియతిరిగితే మాత్రం వారికి ఊహించని పరిణామాలే ఎదురవుతున్నాయి. పెయిడ్ ఏరియాలో స్మార్ట్ కార్డుతో తిరిగితే అందులోని బ్యాలెన్స్ ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది.

ఉప్పల్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. స్మార్ట్‌కార్డు కోసం రూ.200 చెల్లిస్తే అందులో రూ.100 ప్రయాణం కోసం వాడుకోవచ్చు. కానీ, సదరు వ్యక్తికి బయటకు వచ్చే ముందు చూసుకుంటే కార్డులో మిగిలింది కేవలం పన్నెండు రూపాయలే. రూ.88 మాయమైపోయాయి. స్టేషన్‌లోకి ప్రవేశించాక రైలు ఎక్కకుండా అన్ని ప్రాంతాలు అలా చూసొద్దామని ఓ గంటసేపు అక్కడే తిరిగితే స్మార్ట్‌కార్డులోని సొమ్ము కరిగిపోతుంది. అందుకే అరగంట లోపే బయటకు రావడం ఉత్తమం. లేదంటే మనకు తెలియకుండానే స్మార్ట్‌కార్డులోని సొమ్మంతా స్వాహా అయిపోతుంది.

స్మార్ట్‌కార్డుతో పెయిడ్ ఏరియాలోకి ప్రవేశించి రైలు ఎక్కకపోయినా చార్జీలు కట్ అవుతూనే ఉంటాయి. స్టేషన్‌లో ఉన్నంత సేపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

ఫైన్ల గోల...

ఒకే రూట్.. ఒకే ట్రెయిన్ అన్న కన్ఫ్యూజన్ తో చాలా మంది ఫైన్లు కట్టాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. నాగోల్ లేక ఉప్ప‌ల్ నుంచి నేరుగా మియాపూర్‌కు వెళ్లాల‌నుకున్నవారు మధ్యలో అమీర్‌పేటలో రైలు మారాల్సి ఉంటుంది. ఒక‌వేళ‌ టిక్కెట్ మియాపూర్ వరకు తీసుకున్న‌ప్ప‌టికీ అమీర్‌పేటలో దాన్ని మార్చుకోవాల్సిందే. అది తెలీక చాలా మంది టికెట్ మార్చుకోకుండా మ‌రో ట్రైన్ ఎక్కేసి మియాపూర్‌లో దిగుతున్నారు. దీంతో వారు అక్కడ ఫైన్ కట్టాల్సి వస్తోంది. స్మార్ట్ కార్డు ఉన్నవాళ్లు కూడా అమీర్‌పేటలో దిగిన తరువాత తమ కార్డును స్వైప్ చేయాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles