BJP leader H Raja gives communal twist to Mersal fracas మెర్సల్‌ చిత్రానికి మతం రంగు పులుముతున్న బీజేపి నేత

Bjp leader h raja gives communal twist to mersal fracas

mersal row, actor vijay, mersal actor, mersal controversy, communal twist, BJP leader, H Raja, mersal BJP, BJP comments, BJP, mersal release, mersal collection, Thalapathy Vijay, mersal, vijay, mersal box office collection, mersal

H Raja, a national secretary of the BJP, posted on Twitter a photo of actor Vijay's voter ID card and official letterhead, his purpose to stress that the Mersal star is a Christian

మెర్సల్‌ చిత్రానికి మతం రంగు పులుముతున్న బీజేపి నేత

Posted: 10/24/2017 10:24 AM IST
Bjp leader h raja gives communal twist to mersal fracas

కాలీవుడ్ హీరో విజయ్ నటించిన చిత్రంలో జీఎస్టీకి వ్యతిరేకంగా డైలాగులు వుండటం వల్ల ఇది తమ ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోడీ విధానాలకు వ్యతిరేకంగా వుందని వార్తలతో వివాదస్పదం అయ్యింది,. దీంతో రంగంలోకి దిగిన తమిళనాడు బీజేపి నేత హెచ్. రాజా ఈ చిత్రాన్ని తాను పైరసీ సీడీలో చూశానని చెప్పి.. బీజేపి పార్టీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైలాగులు వున్నాయని  వివాదానికి మరింత అజ్యం పోశారు. దీంతో దీపావళి రోజున విడుదలైన ఈ చిత్రం అటు థీయేటర్లతో పాటు ఇటు రాజకీయవర్గాల్లో కూడా తీవ్ర చర్చకు దారి తీసింది.

ఈ క్రమంలో నడిఘర్ సంఘం అధ్యక్షుడు హీరో విశాల్ రంగంలోకి దిగి.. కేంద్రంలో అధికారంలో వున్న పార్టీకి.. జాతీయ నేతగా కొనసాగుతూ.. పైరసీ సీడీలో సినిమాను చూశాను అని చెప్పడానికి సిగ్గులేదా..? అని ప్రశ్నించాడు. దీంతో మరుసటి రోజున ఆయన నివాసం, కార్యాలయాలపై బీజేపి క్షక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. జీఎస్టీ అధికారులను రంగంలోకి దింపి ఆయన తనిఖీలు చేపట్టారన్న వార్త తమిళనాడు మీడియా సంస్థలు ప్రకటించాయి. అయితే తాము ఎలాంటి దాడులు చేయలేదని జీఎస్టీఐ అధికారులు ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేశారు.

ఇలా ఈ వివాదం సద్దుమణిగిందని అనుకుంటున్న క్రమంలోనే ఈ చిత్రానికి బీజేపి నేత రాజా మతం రంగు పులిమారు. కాలీవుడ్ హీరో విజయ్ మతం మార్చుకున్నాడని నిన్న సంచలన ఆరోపణలు చేసిన ఆయన ఇవాళ వివాదానికి మరింత ఆజ్యం పోశారు. విజయ్ ఓటరు ఐడీ కార్డును (నెంబరు టీఏయూ 1900109)ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఇప్పటికైనా నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఓటర్ ఐడీలో విజయ్ పేరు జోసఫ్ విజయ్ అని ఉంది.

దీంతో పాటు సీ జోసఫ్ విజయ్, మూవీ ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్ అని ఉన్న ఓ లెటర్ హెడ్ ను కూడా పోస్టు చేశారు. నిజాన్ని ఎవరూ చంపలేరని వ్యాఖ్యానించిన ఆయన, మెర్సిల్ సినిమాలోని డైలాగ్ "దేవాలయాల కన్నా ముందు ఆసుపత్రులను నిర్మించాలి"ని ప్రస్తావిస్తూ, గత 20 సంవత్సరాల్లో 17,500 చర్చిలు, 9,700 మసీదులు, 370 దేవాలయాలు ఇండియాలో నిర్మితమయ్యయి. వీటిల్లో వేటిని కూల్చి ఆసుపత్రులు కట్టిద్దామో విజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mersal row  actor vijay  controversy  BJP leader H Raja  communal twist  Hero vishal  Kollywood  politics  

Other Articles