Top Lashkar commander killed in gunfight ముష్కర ముఖ్యుడిని మట్టుబెట్టిన ఇండియన్ ఆర్మీ

Two let militants including commander killed in encounter in kashmir

Jammu & Kashmir, Militancy, LeT, Encounter, Anti-militancy operations, Security forces, J&K Police, Army, Wasim Shah, LeT commander

Wasim Shah was a militant on the most-wanted list of security forces in Kashmir and was suspected to be one of the architects of last year’s unrest in the Valley.

ముష్కర ముఖ్యుడిని మట్టుబెట్టిన ఇండియన్ ఆర్మీ

Posted: 10/14/2017 11:06 AM IST
Two let militants including commander killed in encounter in kashmir

జమ్మూకశ్మీర్‌లో భద్రతాదళాలకు మరో విజయం సాధించాయి. పుల్వామా జిల్లాలో ఇవాళ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్లో భారత భద్రతా దళాల మోస్ట్ వాంటెడ్ లిస్టులో వున్న లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ వసీం షాను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లాలోని లిట్టర్‌ గ్రామంలో భద్రతాదళాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులు ఇద్దరు ముష్కరులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారని ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి.

వీరిలో ఒకరు సాధారణ ముష్కరుడు నజీర్‌ అహ్మద్ గా గుర్తించిన అధికారులు.. మరోకరని మాత్రం..  పది లక్షల రివార్డును తలపె పెట్టకుని తిరుగుతున్న ముష్కర ముఖ్యడు వసీం షాగా గుర్తించాయి. వసీం షా లష్కరే తోయిబా షోపియన్‌ జిల్లా కమాండర్‌గా కొనసాగుతున్నాడు. వసీం షాను మట్టుబెట్టిన భద్రతా దళాలను జమ్మూకశ్మీర్‌ డీజీపీ ఎస్పీ వైద్‌ ప్రశంసించారు. 'క్లీన్‌ ఆపరేషన్ లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వెల్ డన్‌ జేకేపీ (జమ్మూకశ్మీర్‌ పోలీస్‌) బాయ్స్‌, సెక్యూరిటీ ఫోర్సెస్‌' అని వైద్ ట్వీట్‌ చేశారు.

దక్షిణ పుల్వామా జిల్లాలోని లిట్టర్‌ గ్రామంలో ఉగ్రవాదులు పొంచి ఉన్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు ఇవాళ ఉదయమే మొత్తం గ్రామాన్ని చుట్టుముట్టి దాగివున్న ముష్కరులను మట్టుబెట్టారు. పోలీసుల తనిఖీల నేపథ్యంలో ఉగ్రవాదులు ఎదురుకాల్పులు జరపడంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. చివరకు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో వసీం షా, నజీర్ అహ్మద్ లు హతమయ్యారు. వసీం షా కు అబు ఒసామా భాయ్ అని కూడా పేరువుందని తెలుస్తుంది.

వసీం షా షోఫియాన్ జిల్లాలోని హెఫ్ గ్రామానికి చెందిన వాడని, విద్యలో రాణించలేక కాలేజీ స్థాయి నుంచే అతను డ్రాప్ అవుట్ గా నిలిచాడని అతని తండ్రి, పండ్ల వ్యాపారి గులాం మహమ్మద్ షా తెలిపాడు. అయితే క్రికెట్ లో మాత్రం వసీం అద్భుతంగా రాణించాడని, అల్ రౌండర్ గా కూడా సేవలందించాడని తెలిపాడు. అతని స్నేహితుడు సెత్తా పార్రీ ఉగ్రవాదంలోకి చేరిన తరువాత 2014లో వసీం కూడా దానిపట్ల అకర్షితుడయ్యాడని తెలిపారు. వసీం మరణవార్త విని అతను విషాదంలో మునిగాడు. ఇక అహ్మద్ నజీర్ కూడా వ్యాలీలోని లిట్టర్ గ్రామానికి చెందిన వ్యక్తి, ఈ ఏడాది మే నెలలోనే ఉగ్రవాదంలో చేరగా. ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్ లో హతుడయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles