ICICI Bank launches 'cashback' home loans వాయిదా కడితే గిప్టుగా క్యాష్ బ్యాక్

Icici bank s new home loan offers 1 cash back for every emi

home loans, ICICI bank, reserve bank of india, RBI, EMI, Cashback, banks, business, companies, loan, latest news

ICICI Bank has launched a cashback feature in its home loans whereby borrowers will receive an amount equivalent to 1 per cent of their annual repayment

భలే మంచి ఆఫర్.. వాయిదా కడితే గిప్టుగా క్యాష్ బ్యాక్

Posted: 09/29/2017 10:34 AM IST
Icici bank s new home loan offers 1 cash back for every emi

ఐసీఐసీఐ బ్యాంకు పండగ సీజన్ లో వచ్చే నెలాఖరు వరకు తమ వద్దకు గృహ రుణాలను తీసుకునే కస్టమర్లకు పది వేల రూపాయలను అఫర్ చేసిన బ్యాంకు.. తాజాగా మరో కొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది. ఒకోసారి పదివేల రూపాయలను ఇవ్వడానికి బదులు.. నెలవారీగా అఫర్ ఇస్తే ఇటు బ్యాంకు అదాయంపై ఎలాంటి ప్రభావం పడకుండా వుండటంతో పాటు అటు కస్టమర్ల నుంచి నెలసరి వాయిదాలు(ఈఎంఐ) కూడా క్రమం తప్పకుండా వస్తాయని యోచించి.. ఏకంగా క్యాస్ బ్యాక్ అఫర్ ను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది.

దీంతో తమ వద్ద గృహ రుణాలను తీసుకునే కస్టమర్లకు బ్యాంకు ఇకపై నెలవారీ వాయిదా చెల్లింపులపై 1 శాతం నగదును తిరిగి చెల్లించనుంది. ఈ మేరకు సరికొత్త క్యాష్ బ్యాక్ ఆఫర్ ను రూపోందించామని బ్యాంకు ప్రకటించింది. అదనపు ద్రవ్యలభ్యత ఉండడంతో బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద రుణాల వృద్ధి తక్కువగా ఉండడం, నివాస మార్కెట్ మందగమనం పాలవుతుందన్న అంచనాల మధ్య తీసుకొచ్చిన ఈ క్యాష్ బ్యాక్‌ వల్ల 30 ఏళ్ల రుణ వ్యవధిలో అసలు మొత్తంపై 11 శాతం దాకా రుణాలు పోందిన వారు లబ్దిపోందే అవకాశం ఉంది.

దీంతో పాటు 20 శాతం స్టెపప్‌ రీపేమెంట్ ను సైతం ఇచ్చే అవకాశం ఉందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ బాగ్చి పేర్కొన్నారు. స్టెపప్ రీపేమెంట్ పద్ధతిలో ప్రారంభంలో ఈఎంఐలు తక్కువగా ఉండి.. తర్వాత పెరుగుతూ ఉంటుంది. రుణ స్వీకర్త వేతనం కాలం గడిచే కొద్దీ పెరుగుతుందన్న అంచనాల మధ్య దీనిని ప్రవేశపెట్టారు. కాగా, ఈ ఆఫర్ కొత్త గృహ రుణ స్వీకర్తలకు మాత్రమేనని బ్యాంకు స్పష్టం చేసింది. యాక్సిస్ బ్యాంక్‌ సైతం శుభ్ ఆరంభ్ పథకం కింద గృహ రుణ స్వీకర్తలకు 12 ఈఎంఐలను మాఫీ చేస్తామంటూ ఇటీవలే కొత్త ఆఫర్‌ ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : home loans  ICICI bank  reserve bank of india  RBI  EMI  Cashback  

Other Articles